T20 Blast: మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్, వండర్ ఫుల్ బ్యాటింగ్, బ్లాస్టింగ్ బ్యాటింగ్, వీర కుమ్ముడు కుమ్మేశాడు.. క్రికెట్ మ్యాచ్‌లో ఎవరైనా బ్యాట్స్‌మెన్ అద్భుతమైన బ్యాటింగ్ చేసినప్పుడు మన నోటి నుంచి ఈ పదాలు వస్తాయి. కానీ, ఈ బ్యాటర్ బ్యాటింగ్ చూస్తే మాత్రం అంతకు మించి అనాల్సి ఉంటుంది. ఎందుకంటే.. బ్యాటింగ్‌లో విధ్వంసం అంటే ఏంటో ఓ రేంజ్‌లో చూపించాడు. క్రీజ్‌లోకి అడుగుపెట్టిన ఈ క్రికెటర్.. తనదైన స్టైల్‌లో వచ్చిన ప్రతిబాల్‌ను ఉతికి ఆరేశాడు. ఎంతలా అంటే.. జస్ట్ 17 బంతుల్లో 76 పరుగులు చేసి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. ఏ రేంజ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. అతనే ఇంగ్లండ్ క్రికెటర్ ఆడమ్ హోస్. ఈ అద్భుత బ్యాటింగ్‌కి టీ20 బ్లాస్ట్ టోర్నీ వేదికైంది.
చరిత్రలో మునుపెన్నడూ కనివిని ఎరుగని..
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ జరగని ఘటన శుక్రవారం జరిగింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇంతకు ముందు ఏ జట్టు కూడా ఈ ఘనత సాధించలేకపోయింది. తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని బర్మింగ్‌హామ్ టీమ్ నమోదు చేసింది. దానికి కారణం ఒకే ఒక్కడు. అతనే ఆడమ్ హోస్.
207.54 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు..
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బర్మింగ్‌హమ్ టీమ్, వోర్సెస్టర్ షైర్ టీమ్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బర్మింగ్‌హమ్ టీమ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 228 పరుగులు చేయగా.. ప్రత్యర్థి టీమ్ వోర్సెస్టర్ షైర్ 84 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో బర్మింగ్ హామ్ 144 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, మ్యాచ్‌లో తొలుత బర్మింగ్‌హామ్ టీమ్ బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమ్ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలో వచ్చాడు కింగ్ లాంటి బ్యాట్స్‌మెన్ ఆడమ్ హోస్. రావడం రావడంతోనే తన బ్యాట్‌ను ఝుళిపించాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పరుగుల తుఫాను సృష్టించాడు. వచ్చిన ప్రతి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. నాలుగో ఓవర్ వద్ద జట్టు స్కోర్ 51 ఉండగా.. సహ బ్యాట్స్‌మెన్ వికెట్ కోల్పోయాడు. ఆ తరువాత వచ్చిన హోస్సే డాన్ మౌసెల్ కలిసి రాణించాడు. మొత్తం బంతులాడిన హోస్.. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఆలోవర్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 207.54 గా ఉంది.
17 బంతుల్లో 77 పరుగులు..
ఆడమ్ హోస్.. 53 బంతులాడి విధ్వంసం సృష్టించాడు. 13 ఫోర్లు, 4 సిక్సర్లతో వీరంగం సృష్టించాడు. ఈ బౌండరీల ద్వారా కేవలం 17 బంతుల్లోనే 77 పరుగులు సాధించాడు. మొత్తానికి తక్కువ బంతుల్లోనే 110 పరుగులతో సాధించి నాటౌట్‌గా నిలిచిన ఆడమ్.. అందరి నోటితో అదుర్స్ అనిపించుకున్నాడు.
? The biggest victory margin in Blast history ?
Watch how it happened ⬇️?#Blast22
— Vitality Blast (@VitalityBlast) June 24, 2022