
భారత క్రికెట్ టీమ్ తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతోన్న తరుణంలో షాక్‌ల మీద షాక్‌లు తలుగుతున్నాయి. ఒక్కో ప్లేయర్ మ్యాచ్‌కు దూరమవుతున్నారు అన్న వార్తలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. 2023 ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆదివారం ఢీకొట్టనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే ప్లేయర్స్ ఒక్కొక్కరు గాయాల భారిన పడుతుండడంతో తీవ్ర ఆందోళన కలుగుతోంది.
ఇప్పటికే టీమిండియా స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే తాజాగా మరో ప్లేయర్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియా ఆల్ రౌండర్ పాండ్యా గాయపడినట్లు తెలుస్తోంది. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యాకు గాయమైనట్లు సమాచారం.
సిరాజ్ వేసిన ఓ బౌన్సర్, పాండ్యా వేలికి బలంగా తగిలిందని, దీంతో అప్పటికప్పుడు బ్యాటింగ్ కొనసాగించకుండానే వెళ్లిపోయాడని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఒకవేళ మ్యాచ్‌కు పాండ్య దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగలడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదవ బౌలర్‌గా, మిడిల్ ఆర్డర్‌లో మంచి బ్యాటింగ్‌తో పాండ్య టీమ్‌కు అండగా నిలవగలడు. అలాంటి ప్లేయర్ మ్యాచ్‌కు దూరమైతే ఇబ్బందిగా మారే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. హార్ధిక్ పాండ్యా గాయానికి సంబంధించి ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి అదికారిక ప్రకటన చేయలేదు. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనున్న ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్‌లో పాండ్యా ఆడుతాడా లేదా అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇక డెంగ్యూతో బాధపడుతోన్న గిల్ మ్యాచ్‌కు దూరమైతే.. ఇషాన్ కిషన్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి…