దింపడయ్యా ఆ మెరుపుతీగను.. వెయిట్ చేయలేక చచ్చిపోతున్నం.. కోహ్లీ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు

AB de Villiers Comments on Vaibhav Sooryavanshi: యువ ప్రతిభను సకాలంలో ప్రోత్సహించినప్పుడే భారత క్రికెట్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుంది. ఇంగ్లాండ్‌తో జరిగే రెండో వన్డే సమరంలోనైనా వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చి, అతనిలోని అసలైన హిట్టింగ్ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని యావత్ క్రికెట్ లోకం కోరుకుంటోంది.

దింపడయ్యా ఆ మెరుపుతీగను.. వెయిట్ చేయలేక చచ్చిపోతున్నం.. కోహ్లీ ఫ్రెండ్ సంచలన వ్యాఖ్యలు
Ab De Villiers Comments On Vaibhav Sooryavanshi

Updated on: Jul 04, 2026 | 5:52 PM

AB de Villiers Comments on Vaibhav Sooryavanshi: భారత క్రికెట్ రంగాన్ని తన సంచలన బ్యాటింగ్‌తో ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిభావంతుడైన ఆటగాడిని బెంచ్‌కే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్ అతనికి సరైన అవకాశమని స్పష్టం చేశారు.

ఇంకా ఆగడం ఎందుకు? డివిలియర్స్ సూటి ప్రశ్న..!

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి ఎప్పుడు దింపుతారంటూ టీం మేనేజ్‌మెంట్‌ను డివిలియర్స్ నేరుగా ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ అతడికి అత్యంత అనుకూలమైనదని, అయినప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం కల్పించకపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్‌లో వైభవ్ చూపించిన అద్భుతమైన ఆటతీరును చూసిన తర్వాత కూడా అతన్ని ఇంకా ఎందుకు వేచి ఉండేలా చేస్తున్నారని డివిలియర్స్ నిలదీశారు. ఐర్లాండ్ సిరీస్‌లోనే అతడిని ఆడించి ఉంటే బాగుండేదని, కనీసం ఈ ఇంగ్లాండ్ సిరీస్‌లోనైనా అతనికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటే?

ఇవి కూడా చదవండి

అభిమానుల ఆరాటం.. స్టేడియాలకు పోటెత్తుతున్న జనం..!

ఈ యువ హిట్టర్ బ్యాటింగ్ విన్యాసాలను అంతర్జాతీయ స్థాయిలో వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కేవలం వైభవ్ ఆటను మైదానంలో ప్రత్యక్షంగా చూడటం కోసమే అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేస్తున్నారని డివిలియర్స్ గుర్తుచేశారు. ఇంతటి క్రేజ్, ప్రతిభ ఉన్న ఆటగాడిని నిరీక్షింపజేయడం ఎంతమాత్రం సరికాదని, అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడానికి వైభవ్‌కు ఇదే అత్యంత సరైన సమయమని ఆయన బలంగా నొక్కి చెప్పారు.

టీం మేనేజ్‌మెంట్ వైఖరి.. బెంచ్‌కే పరిమితమైన యువ కిశోరం..!

ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న భారత జట్టులో వైభవ్‌కు వరుసగా నిరాశే ఎదురవుతోంది. ఇప్పటివరకు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే ఈ మూడు మ్యాచ్‌లలోనూ వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. భారత జట్టు అగ్రశ్రేణి బ్యాటింగ్ వరుసలో ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టే ఉద్దేశం లేకపోవడం వల్లే మేనేజ్‌మెంట్ ఈ విధమైన వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాడిపనైపోయింది, ఇక ఆడలేడు.. ఇప్పటికైనా అతడిని రంగంలోకి దింపడయ్యా సామీ..!

రెండో టీ20పైనే అందరి చూపు..!

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి పోరు వర్షార్పణం కాగా, ఇరు జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది. ఈ కీలక మ్యాచ్‌లోనైనా టీం ఇండియా మేనేజ్‌మెంట్ డివిలియర్స్ సూచనలను, అభిమానుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని వైభవ్‌కు అవకాశం కల్పిస్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us