
Team India 15 Member Squad for World Cup 2023: వన్డే ప్రపంచకప్‌నకు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో 15 మంది సభ్యలు జాబితాను ప్రకటించారు. టీమ్ సెలక్షన్‌కి సంబంధించి ఇద్దరికీ పలు ప్రశ్నలు సంధించారు. అదే సమయంలో ఒక జర్నలిస్ట్ అడిగిన ఓ ప్రశ్న రోహిత్ శర్మకు కోపం తెప్పించింది. ప్రపంచకప్‌లో ఈ ప్రశ్న మళ్లీ అడగకూడదంటూ స్పష్టమైన మాటలతో ఆదేశించాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా రోహిత్ శర్మను డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణం గురించి ప్రశ్నించారు. డ్రెస్సింగ్ రూమ్ గురించి వస్తున్న వార్తలపై రోహిత్ ఏం చెబుతారని ప్రశ్నించారు. ఇది విన్న భారత కెప్టెన్‌కి కోపం వచ్చింది. ఇలాంటి ప్రశ్నకు మళ్లీ సమాధానం చెప్పనంటూ తోసిపుచ్చారు.
LIVE: Selection Day | ICC Cricket World Cup 2023 https://t.co/VSMnnSNfiZ
— Star Sports (@StarSportsIndia) September 5, 2023
ఇది జట్టు ఆటగాళ్లపై ప్రభావం చూపదని గతంలో కూడా చెప్పాను అంటూ రోహిత్ తెలిపాడు. ఆటగాళ్లందరూ అన్నీ చూశారు. భారత్‌లో వరల్డ్‌కప్ జరుగుతున్నప్పుడు మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు, వాతావరణం ఇలా ఉందా లేదా అని అడగకండి. ఎందుకంటే దానికి నేను ఇప్పుడు సమాధానం చెప్పను. ఇది ఏ మాత్రం అర్ధం లేనిది. మా దృష్టి ప్రస్తుతం అంతా ఆటపైనే ఉంది. మేం జట్టుగా దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
రోహిత్ శర్మ(కెప్టెన్), హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా.
రోహిత్ శర్మ, అగార్కర్ ప్రకటించిన జట్టు నుంచి ముగ్గురు మిస్ అయ్యారు. అందులో సంజూ శాంసన్, ప్రసీధ్ద్, తెలుగబ్బాయి తిలక్ వర్మలకు హ్యాండిచ్చారు. కాగా, మిగతా జట్టు అంతా అనుకున్నదే ఎంపిక చేశారు. అయితే, ఈ జట్టులో రైట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ లేకపోవడం కాస్త ఇబ్బందిగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..