Cricket: అదే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ కూడా అప్పుడే: ఊహాగానాలకు తెరదించిన స్టార్ ప్లేయర్..

|

Jan 13, 2023 | 12:35 PM

David Warner Retirement: యూఏఈలో నిర్వహించిన 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా ట్రోఫీని దక్కించుకుంది. ఇందులో 289 పరుగులు చేసినందుకు వార్నర్ 2021లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు.

Cricket: అదే నా చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ కూడా అప్పుడే: ఊహాగానాలకు తెరదించిన స్టార్ ప్లేయర్..
David Warner
Follow us on

David Warner Retirement: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలిసారిగా తన రిటైర్మెంట్ ఊహాగానాలపై మౌనం వీడాడు. ఈ అనుభవజ్ఞుడైన ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్, రిటైర్మెంట్ గురించి సూచించాడు. 2024లో యూఎస్‌, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ తన చివరి అంతర్జాతీయ టోర్నమెంట్‌గా ఉండాలని కోరుకుంటున్నానని, టైటిల్ గెలవడం తనకు గర్వకారణంగా మారుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌ గెలవడమే నా కల..

వార్నర్ గురువారం ‘స్కై స్పోర్ట్స్’తో మాట్లాడుతూ, “ఇది నా అంతర్జాతీయ కెరీర్‌లో చివరి సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నా దృష్టిని 2024 టీ20 ప్రపంచ కప్‌పై ఉంచాను. కాబట్టి టైటిల్‌ను అమెరికాలో ఒడిసిపట్టాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

గత ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్..

విశేషమేమిటంటే, యూఏఈలో నిర్వహించిన 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా ట్రోఫీని దక్కించుకుంది. ఇందులో 289 పరుగులు చేసినందుకు వార్నర్ 2021లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా ఎంపికయ్యాడు. అతను ఇటీవల తన 100వ టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకులకు తగిన సమాధానం కూడా ఇచ్చాడు. వార్నర్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరపున ఆడుతున్నాడు. ఈ ఏడాదితోపాటు వచ్చే సంవత్సరానికి థండర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాను, ఇది నాకు సహకరించాల్సిన సమయం అని చెప్పుకొచ్చాడు. ఇది బహుశా నా అంతర్జాతీయ కెరీర్‌లో చివరి సంవత్సరం కావచ్చు అంటూ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

భారత పర్యటనకు వార్నర్..

ప్రస్తుత కాలపు తుఫాన్ బ్యాట్స్‌మెన్‌లలో వార్నర్ ఒకడిగా పేరుగాంచాడు. అతను ఆస్ట్రేలియా మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌ల జాబితాలో చేరాడు. తాను రాబోయే భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నానని, జట్టులో చోటు దొరికితే అక్కడ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తానని గతేడాది డిసెంబర్‌లో పేర్కొన్నాడు. వార్నర్ తన ఫామ్‌పై విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియాతో గొడవ జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వార్నర్ ప్రకటన వెలువడించాడు. అయితే భారత పర్యటన కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో అతనికి చోటు కల్పించడం గమనార్హం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..