ప్రతీ జట్టుకు ఓ కీలక ఆటగాడు ఉంటాడు. ఆ ప్లేయర్‌ను పెవిలియన్‌కు పంపడానికి ప్రత్యర్ధులు ఎన్నో ప్రణాళికలు రచిస్తారు. సరిగ్గా ఇదే సీన్ తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో రిపీట్ అయింది. 17 ఏళ్ల ప్లేయర్‌ను ఔట్ చేయడానికి.. ప్రత్యర్ధి టీం ఏకంగా 9 మంది బౌలర్లను ప్రయోగించింది. అయితే ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఆ ప్లేయర్ పెను విధ్వంసం సృష్టించాడు. ఆ 9 మంది బౌలర్లను ఊచకోత కోశాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో.? అది ఏ మ్యాచ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం.!
మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్‌ల కోసం రువాండా, ఈశ్వతిని జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య తాజాగా ఓ మ్యాచ్ జరిగింది. ఇందులో రువాండా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనింగ్‌కు దిగిన 17 ఏళ్ల జిసిల్ ఇషిమ్వే ఈశ్వతిని బౌలర్‌లపై విరుచుకుపడింది. మొదటి బంతి నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దీనితో రువాండా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. ఇందులో సగానికి పైగా పరుగులు జిసిల్ ఇషిమ్వే చేయడం గమనార్హం.
17 ఏళ్ల రువాండా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ జిసిల్ 69 బంతులు ఎదుర్కొని 114 పరుగులతో అజేయంగా నిలిచింది.165.21 స్ట్రైక్ రేట్‌తో తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు కొట్టింది. ఇక భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన ఈశ్వతిని జట్టు పేలవ ప్రదర్శన చూపించింది. కేవలం 19 పరుగులకే కుప్పకూలింది.
Rwanda score mammoth 204/5 after a memorable century (114*) from Rwanda’s teenage sensation #GiseleIshimwe against Eswatini #ICCWomensT20WorldCupAfricaQualifiers pic.twitter.com/DdbOMWMSuz
— Rwanda Cricket Association (@RwandaCricket) September 12, 2021
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్