AUS vs WI: 16 సిక్సర్లు.. 415 రన్స్‌.. ఆస్ట్రేలియా వర్సెస్‌ విండీస్‌ టీ20 మ్యాచ్‌ హైలెట్స్‌ వీడియో చూశారా?

హోబర్ట్ మైదానంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఆతర్వాత వెస్టిండీస్ జట్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది.

AUS vs WI: 16 సిక్సర్లు.. 415 రన్స్‌.. ఆస్ట్రేలియా వర్సెస్‌ విండీస్‌ టీ20 మ్యాచ్‌ హైలెట్స్‌ వీడియో చూశారా?
Australia Vs West Indies
Follow us

|

Updated on: Feb 09, 2024 | 10:10 PM

హోబర్ట్ మైదానంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరిగింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఆతర్వాత వెస్టిండీస్ జట్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లకు 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్ మొదటి 10 ఓవర్ల బ్యాటింగ్‌ చూస్తే ఆ జట్టుదే వవిజయమనుకున్నారు. అయితే లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భుతమైన బౌలింగ్ ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. భారీ లక్ష్య ఛేదనలో బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ వెస్టిండీస్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరూ 8 ఓవర్లలో 89 పరుగులు జోడించారు, అయితే దీని తర్వాత జంపా బౌలింగ్‌ కు దిగాడు. జాన్సన్ 42 పరుగుల వద్ద చార్లెస్‌ను అవుట్ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీని తర్వాత, బ్రెండన్ కింగ్ కూడా హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. కింగ్ కేవలం 37 బంతుల్లో 53 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీని తర్వాత విండీస్ మిడిల్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. 14 పరుగులు చేసిన విండీస్ కెప్టెన్ పావెల్ ను మ్యాక్స్ వెల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత హోప్‌ ను స్టోయినిస్ బోల్తా కొట్టించాడు. సిక్సర్లు బాదిన నికోలస్ పురాన్ 17 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతనితో పాటు ఆండ్రీ రస్సెల్‌ వికెట్ల పడగొట్టి కరేబియన్ జట్టుకు షాక్ ఇచ్చాడు జంపా. ఈ మ్యాచ్‌ లో మొత్తం 4 ఓవర్లు వేసిన ఈ లెగ్‌ స్పిన్నర్‌ 26 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, డేవిడ్ వార్నర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 36 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌ గా నిలిచాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. జోష్ ఇంగ్లీష్ 39 పరుగులు చేయగా, చివర్లో టిమ్ డేవిడ్ 17 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికీ ఇరు జట్ల బౌలర్లు దారుణంగా విఫలయ్యారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 16 సిక్సర్లు నమోదయ్యాయి. అంతేకాదు ఇరు జట్లు కలిసి 415 పరుగులు నమోదయ్యాయి. మరి ఇప్పుడు టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ పునరాగమనం చేస్తుందా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి

మలుపుతిప్పిన జంపా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..