BCCI: టీమిండియా క్రికెటర్లకూ కోవిడ్ వ్యాక్సిన్.. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న బీసీసీఐ..

BCCI: కోవిడ్ వ్యాక్సిన్‌ను క్రికెటర్లకూ ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడుతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధూమాల్ తెలిపాడు.

BCCI: టీమిండియా క్రికెటర్లకూ కోవిడ్ వ్యాక్సిన్.. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్న బీసీసీఐ..

Updated on: Jan 31, 2021 | 8:58 PM

BCCI: కోవిడ్ వ్యాక్సిన్‌ను క్రికెటర్లకూ ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడుతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ ధూమాల్ తెలిపాడు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి మీడియాతో మాట్లాడిన అరుణ్ సింగ్.. ‘కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మన దగ్గర ప్రధాన్యత ప్రకారం ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి, ఆ తరువాత కోవిడ్ ముప్పు ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే, క్రికెటర్లకూ వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉంది. విదేశీ జట్లతో మ్యాచ్‌ల నేపథ్యంలో వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించాలని భావిస్తున్నాం. ఆ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే దీనిపై నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నాం.’ అంటూ చెప్పారు.

ఇదిలాఉండగా, గతేడాది విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించగా.. ఈ ఏడాది మాత్రం స్వదేశంలోనే నిర్వహిస్తామని అరుణ్ సింగ్ ధూమాల్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున.. భారత్‌లోనే ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.

Also read:

KTR: కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాల.. నా కల అదేంనంటూ కేటీఆర్‌ ట్వీట్‌..

Sasikala: శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా.. పార్టీపై మళ్లీ పట్టు సాధించేందుకేనా?