Bajrang Punia: కామన్వెల్త్ గేమ్స్ 2022 ఎనిమిదో రోజు కూడా భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. అన్షు మాలిక్, దీపక్ పూనియా, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఫైనల్‌లో తమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ విధంగా రెజ్లింగ్‌లో భారత్‌కు 4 పతకాలు ఖాయమయ్యాయి. అదే సమయంలో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటివరకు సాధించిన పథకాల సంఖ్య 20 దాటేసింది. ఇందులో 7 బంగారు పతకాలతో పాటు 7 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.
దీపక్ పూనియా సెమీఫైనల్‌లో విజయం సాధించడం ద్వారా రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖాయం చేశాడు. 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ కెనడాకు చెందిన అలెగ్జాండర్ మూర్‌పై 3-1 తేడాతో విజయం సాధించాడు. అయితే కెనడా ఆటగాడు అమర్‌వీర్ ధేసి చేతిలో భారత్‌కు చెందిన మోహిత్ గ్రేవాల్ ఓడిపోయాడు. అదే సమయంలో, బజరంగ్ పునియా కూడా సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. 65 కేజీల విభాగంలో జరంగ్ పునియా 10-0తో ఇంగ్లండ్ జార్జ్ రామ్‌పై విజయం సాధించాడు.
సాక్షి మాలిక్ కూడా ఫైనల్ చేరింది
అలాగే సాక్షి మాలిక్ తన మ్యాచ్‌ను కూడా గెలుచుకోగలిగింది. ఈ విజయంతో సాక్షి మాలిక్ ఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది. 62 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్‌లో ఆమె 10-0తో కామెరూన్‌కు చెందిన బెర్త్ ఎమిలీన్‌ను ఓడించింది. ఈ విధంగా, కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత రెజ్లర్లు ఇప్పటివరకు 4 పతకాలను సాధించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి