CWG 2022: క్రీడల కుంభమేళాకు సర్వం సిద్ధం.. నేటినుంచే పోటీలు.. 215 మంది ఆటగాళ్లతో భారత్ రెడీ.. పూర్తి వివరాలు..

|

Jul 28, 2022 | 7:24 AM

ఈ సంవత్సరం 72 దేశాల నుంచి 4,500 మందికి పైగా క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటున్నారు. 19 క్రీడలలో 283 పతక ఈవెంట్‌లు జరగనున్నాయి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌ ఎంట్రీ ఇవ్వనుంది.

CWG 2022: క్రీడల కుంభమేళాకు సర్వం సిద్ధం.. నేటినుంచే పోటీలు.. 215 మంది ఆటగాళ్లతో భారత్ రెడీ.. పూర్తి వివరాలు..
Cwg 2022 Athletics
Follow us on

Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడలు జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఈ క్రీడల మహా కుంభ్‌లో భారతదేశానికి చెందిన 215 మంది ఆటగాళ్లు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే పతకంపై అతిపెద్ద ఆశ పెట్టుకున్న నీరజ్ చోప్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అదే సమయంలో, కర్ణాటకకు చెందిన ఐశ్వర్యబాబు కామన్వెల్త్ గేమ్స్‌కు వెళ్లే ముందు డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. ట్రిపుల్ జంప్‌లో జాతీయ రికార్డు హోల్డర్‌గా నిలిచిన అతను నిరాశపరిచాడు. ఇటువంటి పరిస్థితిలో ప్రస్తుతం 213 మంది భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకం కోసం ఆడనున్నారు. 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో 19 విభిన్న క్రీడలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు రెడీ అయ్యారు. భారత ఆటగాళ్ల షెడ్యూల్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుక ఈ రాత్రి 11.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత మూడో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.

ఈ సంవత్సరం 72 దేశాల నుంచి 4,500 మందికి పైగా క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటున్నారు. 19 క్రీడలలో 283 పతక ఈవెంట్‌లు జరగనున్నాయి. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్‌ ఎంట్రీ ఇవ్వనుంది. తొలిసారిగా మహిళా క్రికెట్ జట్టు ఈ క్రికెట్ ఆడనున్నారు. కామన్వెల్త్ క్రీడలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ ఒలింపిక్స్ ఆసియా క్రీడల తర్వాత మూడవ అతిపెద్ద క్రీడా ఈవెంట్‌‌గా పేరుగాంచింది. మొదటి కామన్వెల్త్ క్రీడలు 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. అదే సమయంలో, భారతదేశం 1934లో తొలిసారిగా ఈ క్రీడల్లో పాల్గొంది. అప్పట్లో ఈ క్రీడలను బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు.

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్ 2022 ఎలా చూడాలి?

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కామన్వెల్త్ గేమ్స్ 2022ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అన్ని ప్రధాన ఈవెంట్‌లు కూడా SonyLIV యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అలాగే టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.

ప్రారంభోత్సవం ఎప్పుడు?

కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుక జులై 28న రాత్రి 11.30 గంటలకు జరగనుంది.