Viral Video: సచిన్‌తో బిల్‌గేట్స్‌ వడాపావ్‌ ఎంజాయ్‌… సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

|

Mar 21, 2025 | 8:25 PM

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల కాలంలో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. దీనిని గేట్స్‌నోట్స్‌.కామ్‌లో ఆయన రాసుకొచ్చారు. ఈసారి నేను మరిన్ని కొత్త ఆలోచనలతో వచ్చాను. ఎందుకంటే ఇక్కడి తెలివైన, ఉన్నతాశయాలు ఉన్నవారు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సవాళ్లను సృజనాత్మక మార్గాల్లో డీల్‌ చేస్తున్నారు అని గేట్స్‌నోట్స్‌.కామ్‌లో

Viral Video: సచిన్‌తో బిల్‌గేట్స్‌ వడాపావ్‌ ఎంజాయ్‌... సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Bill Gates Vada Pav With Sa
Follow us on

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల కాలంలో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. దీనిని గేట్స్‌నోట్స్‌.కామ్‌లో ఆయన రాసుకొచ్చారు. ఈసారి నేను మరిన్ని కొత్త ఆలోచనలతో వచ్చాను. ఎందుకంటే ఇక్కడి తెలివైన, ఉన్నతాశయాలు ఉన్నవారు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సవాళ్లను సృజనాత్మక మార్గాల్లో డీల్‌ చేస్తున్నారు అని గేట్స్‌నోట్స్‌.కామ్‌లో ఆయన రాసుకున్నారు.

తాజాగా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తో బిల్‌గేట్స్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముంబై ఫేమస్‌ స్నాక్‌ వడాపావ్‌ను తింటూ ఎంజాయ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను బిల్‌గేట్స్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. పని చేయడానికి ముందు ఓ స్నాక్‌ బ్రేక్‌ అంటూ రాసుకొచ్చారు. వీడియోలో సర్వింగ్ వెరీసూన్‌ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోలో సచిన్‌, బిల్‌గేట్స్‌ ఇద్దరూ ఓ బెంచ్‌పై కూర్చొని వడాపావ్‌ను ఎంజాయ్‌చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ వీడియో షేర్‌ చేసిన వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, శిఖర్‌ ధావన్‌ లైక్‌ చేశారు. 2023లో తొలిసారి బిల్‌గేట్స్‌ సచిన్‌ కుటుంబంతో భేటీ అయ్యారు. నాడు ఈ విషయాన్ని లిటిల్‌మాస్టర్‌ ఎక్స్‌లో షేర్‌ చేశారు. దాతృత్వానికి సంబంధించి గొప్ప విషయాలు నేర్చుకొన్నట్లు రాసుకున్నారు. దానికి స్పందనగా సచిన్‌ నుంచి పిల్లల ఆరోగ్యంపై చాలా విషయాలు నేర్చుకొన్నట్లు గేట్స్‌ వెల్లడించారు.

వీడియో చూడండి: