వార్నర్‌, స్మిత్‌‌లపై ముగిసిన నిషేధం

సిడ్నీ:  ఆసీస్‌ క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై విధించిన నిషేధం ముగిసింది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో వారిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం నేటితో పూర్తి కావడంతో వారు తిరిగి దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల నిషేధం ముగిసిందన్న విషయాన్ని ఆసీస్‌ క్రికెట్‌ చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ వెల్లడించారు. ఇక నుంచి వారు […]

వార్నర్‌, స్మిత్‌‌లపై ముగిసిన  నిషేధం

Edited By:

Updated on: Apr 05, 2019 | 1:35 PM

సిడ్నీ:  ఆసీస్‌ క్రికెటర్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌లపై విధించిన నిషేధం ముగిసింది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌లో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో వారిపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం నేటితో పూర్తి కావడంతో వారు తిరిగి దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ల నిషేధం ముగిసిందన్న విషయాన్ని ఆసీస్‌ క్రికెట్‌ చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ వెల్లడించారు. ఇక నుంచి వారు స్వేచ్ఛగా అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొనవచ్చని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   అయితే నిషేధం ముగిసిన రోజే ఈ ఇద్దరు క్రికెటర్లు మన హైదరాబాద్‌లో ఉన్నారు. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది.