ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 34 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఫైనల్లో భారత మహిళా జట్టు బోల్తా పడింది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో 85 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో విఫలమై తొలి కప్‌ను అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఫలితంగా ఆసీస్ అయిదో సారి ఛాంపియన్‌గా నిలిచింది.
కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అలిస్సా హీలి (75; 39 బంతుల్లో 7×4, 5×6), బెత్ మూనీ (78*; 54 బంతుల్లో 10×4) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (33; 35 బంతుల్లో; 2×4) ఫర్వాలేదనిపించింది. ఆసీస్ బౌలర్లలో షట్ (4/18), జొనాసెన్ (3/20) సత్తా చాటారు.
[svt-event date=”08/03/2020,4:21PM” class=”svt-cd-green” ]
Meg Lanning shows her emotions after leading Australia to back-to-back #T20WorldCup titles ? pic.twitter.com/2xOXI4SSWe
— T20 World Cup (@T20WorldCup) March 8, 2020