hima das: భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌కు సంబంధించి అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిమదాస్‌కు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) ఉద్యోగం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉండగా.. ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం సోనోవాల్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. సీఎం నిర్ణయానికి మంత్రివర్గం కూడా సమ్మతి తెలిపింది. దాంతో హిమదాస్‌కు డీఎస్పీ ఉద్యోగం ఖాయమైంది. కాగా, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అసోం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తెలిపారు. పోలీసు, ఎక్సైజ్, రవాణా శాఖల్లో వారికి ఉద్యోగాలు ఇచ్చేలా సమగ్ర విధానాన్ని కూడా తీసుకువస్తామన్నారు.
‘ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1 ఆఫీసర్లుగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్ సీనియర్ పతక విజేతలు క్లాస్ 2 నియామకం కోసం రాష్ట్రం సమగ్ర క్రీడా పాలసీకి సవరణను మంత్రివర్గం ఆమోదించింది. హిమదాస్‌ను డిప్యూటీ సూపరింటెండెంట్‌గా నియమిస్తారు’ అని అసోం సీఎం సోనోవాల్ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు అసోం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభినందించారు. హిమదాస్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆ మేరకు కేంద్ర మంత్రి రిజిజు హిమదాస్‌తో కలిసి ఉన్న ఫోటోఉ ట్వీట్ చేశారు. ఇక అసోం ప్రభుత్వ నిర్ణయంపై హిమదాస్ కూడా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయం తనను మరింత ప్రోత్సహించినట్లయిందని పేర్కొంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
ఇకపోతే, అస్సాం కు చెందిన స్టార్ స్ప్రింటర్ హిమదాస్ ఫిన్లాండ్‌లో జరిగిన అండర్ 20 ప్రపంచ చాంపియన్ షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా హిమదాస్ నిలిచింది.
Central Minister kiren Rijiju Tweet:
Well done! Assam Cabinet, headed by CM @sarbanandsonwal Ji has decided to offer the post of DSP in Assam Police to sprinter queen @HimaDas8 ! pic.twitter.com/kfkFcYj4KE
— Kiren Rijiju (@KirenRijiju) February 10, 2021
Hima Das Tweet:
It is an honour and I look forward to join Assam Police. https://t.co/kQG7fqEXav
— Hima (mon jai) (@HimaDas8) February 11, 2021
Also read: