పారాలింపిక్స్‌లో దుమ్ములేపుతున్న భారత అథ్లెట్స్.. ఖాతాలోకి మరో రెండు పతకాలు..

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ దుమ్ములేపుతున్నారు. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు.

పారాలింపిక్స్‌లో దుమ్ములేపుతున్న భారత అథ్లెట్స్.. ఖాతాలోకి మరో రెండు పతకాలు..
Mariappan

Updated on: Aug 31, 2021 | 6:10 PM

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్స్ దుమ్ములేపుతున్నారు. ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఇప్పటికే భారత్ ఖాతాలోకి ఎనిమిది పతకాలు వచ్చి చేరగా.. తాజాగా మరో రెండు పతకాలు కూడా వచ్చాయి. మెన్స్ హైజంప్ విభాగంలో మరియప్పన్ తంగవేలు రజతం పతకాన్ని సాధించగా.. శరద్ కుమార్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.

తాజాగా వచ్చిన ఈ పతకాలతో భారత్ ఖాతాలోని పతకాల సంఖ్య పదికి చేరింది. వీటిలో రెండు గోల్డ్, 5 సిల్వర్, 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మరియప్పన్ తంగవేలు తొలిసారిగా 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా, మరియప్పన్, శరద్ విజయాలను మెచ్చుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా వారిని అభినందించారు.

ఇవి చదవండి: