Video: నాడు 4 గోల్డ్‌ మెడల్స్‌తో సంచలనం.. నేడు కూరగాయలు అమ్ముతున్న అథ్లెట్‌.. వైరల్‌ వీడియో

Amardeep Kumar Viral Video: అంతర్జాతీయ స్థాయిలో భారత్‌, జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించి నాలుగు స్వర్ణ పతకాలు సాధించిన త్రోబాల్‌ క్రీడాకారుడు అమర్‌దీప్‌ కుమార్‌ ప్రస్తుతం రాంచీలో తండ్రి కూరగాయల దుకాణంలో పనిచేస్తున్నారు. ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Video: నాడు 4 గోల్డ్‌ మెడల్స్‌తో సంచలనం.. నేడు కూరగాయలు అమ్ముతున్న అథ్లెట్‌.. వైరల్‌ వీడియో
Amardeep Kumar Throwball Player

Updated on: Aug 31, 2026 | 12:53 PM

Amardeep Kumar: దేశం కోసం అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించిన ఓ క్రీడాకారుడి ప్రస్తుత పరిస్థితి క్రీడాభిమానులను కలచివేస్తోంది. త్రోబాల్‌ క్రీడాకారుడు అమర్‌దీప్‌ కుమార్‌ రాంచీలోని అర్గోడా చౌక్‌లో కూరగాయలు విక్రయిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒకవైపు ఆయన సాధించిన పతకాలు గోడకు వేలాడుతుండగా.. మరోవైపు అదే క్రీడాకారుడు కూరగాయలు తూకం వేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు..

అమర్‌దీప్‌ కుమార్‌ త్రోబాల్‌లో భారత్‌, జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ పోటీల్లో భారత్‌ తరపున 4 స్వర్ణ పతకాలు సాధించాడు. పదో తరగతి తర్వాత త్రోబాల్‌ను ప్రారంభించిన ఆయన.. రాంచీలోని జైపాల్‌ సింగ్‌ ముండా స్టేడియం నుంచి తన క్రీడా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అనంతరం జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: Video: 6 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం.. 26 బంతుల్లో 296 స్ట్రైక్ రేట్‌తో కాటేరమ్మ కొడుకు ఊచకోత చూశారా..?

పతకాలున్నా.. ఉపాధి కోసం పోరాటం..

ప్రస్తుతం అమర్‌దీప్‌ తన తండ్రి నిర్వహిస్తున్న కూరగాయల దుకాణంలో కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. రాంచీలోని అర్గోడా చౌక్‌లో ఆయన కూరగాయలు తూకం వేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. తన క్రీడా విజయాలకు గుర్తుగా లభించిన పతకాలు దుకాణం వెనుక గోడపై వేలాడుతుండటం ఈ వీడియోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది.

ఉద్యోగం కోసం క్రీడా కోటాలో పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత ఉద్యోగం లభించలేదని అమర్‌దీప్‌ చెప్పినట్లు కథనం పేర్కొంది. కుటుంబ అవసరాల కోసం తండ్రి దుకాణంలో పనిచేస్తున్నట్లు తెలిపింది.

ఆరేళ్ల క్రితం ఇదే పరిస్థితి..

అమర్‌దీప్‌ కూరగాయలు అమ్ముతున్న దృశ్యాలు ఇప్పుడు తొలిసారి వెలుగులోకి రావడం కాదు. 2020లో కరోనా సమయంలోనూ ఆయన కూరగాయలు విక్రయిస్తున్న ఫొటోలు, వార్తలు బయటకు వచ్చాయి. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి అదే పరిస్థితికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!

క్రీడాకారుల భవిష్యత్తుపై ప్రశ్నలు..

అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన క్రీడాకారులకు పోటీలు ముగిసిన తర్వాత ఉపాధి, ఆర్థిక భద్రత, కెరీర్‌ అవకాశాలు ఎంతమేరకు అందుతున్నాయనే ప్రశ్నలు అమర్‌దీప్‌ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చాయి. పతకాలు సాధించిన ప్రతిభావంతులకు తగిన గుర్తింపు, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us