21 ఏళ్ల భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ శుక్రవారం రాత్రి పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. అమన్ 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించి దేశానికి మరో పతకాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కాంస్య పతక పోరులో అమన్ 13-5 తేడాతో ప్యూర్టో రికో రెజ్లర్‌ను ఏకపక్షంగా ఓడించాడు. అయితే అమన్ విజయం వెనుక అతను.. బృందం పడిన కష్టానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చాయి. స్వర్ణం అందుకోవాల్సిన స్టేజ్ లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అధిక బరువుతో మ్యాచ్ ఆడకుండానే నిష్క్రమించడంతో కాంస్యం పోరుకు ముందు అమన్ సెహ్రావత్ పై దృష్టి పెట్టారు. అమన్ బరువు కూడా చాలా పెరిగింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిన అమన్ సెహ్రావత్ బరుగు గురువారం రోజున 61.5 కేజీలు ఉన్నాడట. అంటే కాంస్య పతకం కోసం జరిగే పోరులో 57కేజీలు ఉండాలి. దీంతో కోసం అమన్ కేవలం కొన్ని గంటల్లోనే 4.5 కిలోలు తగ్గాడు. అవును భారత రెజ్లర్ అమన్ బరువుని సీనియర్ కోచ్, అతని సహాయక సిబ్బంది కలిసి కాంస్య పతక పోటీకి ముందు ఆ బరువుని తగ్గించారు.
జపాన్ రెజ్లర్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో అమన్ బరువు తూకం వేసినప్పుడు అది 61.5 కిలోలు. అమన్ 57 కిలోల విభాగంలో ఆడుతాడు. క్యాసం కోసం పోటీ పడే అతని కేటగిరీలో బరువు కంటే అమన్ ఉన్న బరువు 4.5 కిలోలు ఎక్కువ. దీంతో భారత కోచ్‌లు జగ్మందర్ సింగ్, వీరేంద్ర దహియాతో పాటు మొత్తం ఆరుగురు రెజ్లింగ్ బృందం అమన్ సెహ్రావత్ బరువును తగ్గించే మిషన్‌ను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అమన్ బరువు తగ్గడానికి కేవలం 10 గంటలు సమయం మాత్రమే ఉంది.
అమన్ సెహ్రావత్‌కు మొదట గంటన్నర మ్యాట్ సెషన్ ఇచ్చారు. అందులో అతను నిలబడి కుస్తీ పట్టేలా చేశారు. దీని తర్వాత అమన్ సెహ్రావత్‌కి ఒక గంట హాట్ బాత్ అంటే గంట పాటు వేడి నీరు స్నానం చేయించారు. రాత్రి 12 గంటల తర్వాత అమన్ సెహ్రావత్ జిమ్‌లో గంటపాటు ట్రెడ్‌మిల్ రన్నింగ్ చేశాడు. అనంతరం అమన్‌కు 30 నిమిషాలు విశ్రాంతి ఇచ్చారు. ఆపై అమన్ కు 5 నిమిషాల చొప్పున 5 సెషన్‌ల సౌనా బాత్ ఇచ్చారు. ఈ విధంగా అతను 3.6 కిలోల బరువు తగ్గాడు. చివరి సెషన్ లో అమన్‌కు మసాజ్ చేయించారు. దీని తర్వాత అమన్ లైట్ జాగింగ్, 15 నిమిషాల రన్నింగ్ సెషన్ ను కంప్లీట్ చేశాడు.
బరువు తగ్గడం కోసం అమన్ రెజ్లింగ్ బృందం పడిన కష్టానికి తగిన ఫలితంగా ఉదయం 4.30 గంటలకు అమన్ బరువు 56.9 కిలోలు అయ్యింది. అంటే ఇది పరిమితి కంటే 100 గ్రాములు తక్కువగా ఉంది.
వినేష్ నుంచి పతకాన్ని దూరం చేసిన బరువు
అమన్ సెహ్రావత్ 10 గంటల్లో 4.5 కిలోల బరువు తగ్గడం చాలా పెద్ద విషయం.. ఎందుకంటే భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడింది. వినేష్ 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా రజత పతకాన్ని కైవసం చేసుకుంది.. అయితే ఫైనల్స్‌కు ముందు ఆమె నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. ఫలితంగా ఆమె అనర్హత వేటుపడింది. ప్రస్తుతం వినేష్ కేసు సీఏఎస్‌లో నడుస్తోంది.. త్వరలో ఈ విషయంపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..