పాక్‌లో భారత్ ఆటగాళ్ల పర్యటన!

దాదాపు 55 సంవత్సరాల తర్వాత భారత టెన్నిస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. త్వరలో జరిగే డేవిస్ కప్ కోసం భారత ఆటగాళ్లు పాక్ కు వెళ్తున్నట్లు ఆల్ ఇండియా టెన్నిస్ అసోషియేషన్ సెక్రటరి జనరల్ హిరోన్మోయ్ ఛటర్జీ తెలిపారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి.. ఐఓసీ నిబంధనలకు కట్టుబడి వెళ్లాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.. పాక్ టీమ్ వరల్డ్ కప్ కోసం భారత్ లో పర్యటించింది. ఇప్పుడు తాము వెళ్తున్నామని ఛటర్జీ  పేర్కొన్నారు. ఇకపోతే పాక్‌లో పర్యటించబోయే ఆటగాళ్లు, […]

పాక్‌లో భారత్ ఆటగాళ్ల పర్యటన!

Updated on: Jul 28, 2019 | 7:28 PM

దాదాపు 55 సంవత్సరాల తర్వాత భారత టెన్నిస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుంది. త్వరలో జరిగే డేవిస్ కప్ కోసం భారత ఆటగాళ్లు పాక్ కు వెళ్తున్నట్లు ఆల్ ఇండియా టెన్నిస్ అసోషియేషన్ సెక్రటరి జనరల్ హిరోన్మోయ్ ఛటర్జీ తెలిపారు. ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి.. ఐఓసీ నిబంధనలకు కట్టుబడి వెళ్లాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.. పాక్ టీమ్ వరల్డ్ కప్ కోసం భారత్ లో పర్యటించింది. ఇప్పుడు తాము వెళ్తున్నామని ఛటర్జీ  పేర్కొన్నారు. ఇకపోతే పాక్‌లో పర్యటించబోయే ఆటగాళ్లు, సిబ్బందికి సంబంధించిన వీసాల కోసం దరఖాస్తు కూడా చేశామని ఛటర్జీ చెప్పారు.