అరుదైన రికార్డుకు అతి చేరువలో… ‘యాక్సిడెంటల్ కెప్టెన్’!

| Edited By:

Sep 10, 2019 | 4:03 PM

ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో ఉంది. గురువారం ఓవల్‌లో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోకుంటే ఇంగ్లాండ్‌లో సుదీర్ఘకాలం తర్వాత యాషెస్ సిరీస్ నెగ్గిన కెప్టెన్‌గా పైన్ రికార్డు సృష్టిస్తాడు. 18 సంవత్సరాల క్రితం ఆసీస్ స్టీవ్‌వా సారథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై 4-1తో యాషెస్ సిరీస్ గెలిచింది. తరువాత ఆస్ట్రేలియాకు కెప్టెన్‌లుగా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్, రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ […]

అరుదైన రికార్డుకు అతి చేరువలో... ‘యాక్సిడెంటల్ కెప్టెన్’!
Follow us on

ఆస్ట్రేలియా సారథి టిమ్‌పైన్ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ ఇప్పటికే ఇంగ్లాండ్‌పై 2-1 ఆధిక్యంలో ఉంది. గురువారం ఓవల్‌లో జరిగే చివరి టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోకుంటే ఇంగ్లాండ్‌లో సుదీర్ఘకాలం తర్వాత యాషెస్ సిరీస్ నెగ్గిన కెప్టెన్‌గా పైన్ రికార్డు సృష్టిస్తాడు. 18 సంవత్సరాల క్రితం ఆసీస్ స్టీవ్‌వా సారథ్యంలో ఇంగ్లాండ్ గడ్డపై 4-1తో యాషెస్ సిరీస్ గెలిచింది. తరువాత ఆస్ట్రేలియాకు కెప్టెన్‌లుగా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్, రికీ పాంటింగ్, మైఖేల్ క్లార్క్ వంటి హేమాహేమీలకు సైతం సాధ్యం కాని ఈ అరుదైన ఘనత పైన్ సొంతమవుతుంది. పాంటింగ్, క్లార్క్ సారథ్యంలో రెండేసి సార్లు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పటికీ వారు యాషెస్ గెలవలేకపోయారు.

కాగా, టిమ్ పైన్ కెప్టెన్‌గా నియమించబడడం అనుకోకుండా జరిగింది. అందుకే అతడిని ‘యాక్సిడెంటల్ కెప్టెన్’ అంటారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్ ఫీల్డర్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారం దెబ్బతీయడానికి(బాల్ ట్యాంపరింగ్) సాండ్ పేపర్ వాడాడు. కెమెరాకు చిక్కిన ఈ ఘటనతో యావత్ క్రికెట్ ప్రపంచం తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ వార్నర్‌లపై 12 నెలల నిషేధం, బాన్‌క్రాఫ్ట్‌పై 10 నెలల నిషేధం విధించడంతో ప్రత్యామ్నయ కెప్టెన్‌గా పైన్‌ను నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా.