National Skill Academy: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ శిక్షణ..

| Edited By: Janardhan Veluru

Sep 12, 2024 | 5:43 PM

నిరుద్యోగులకు నేషనల్‌ స్కిల్ అకాడమీ శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 100కిపైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ స్కిల్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ పొందే సదవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా భారత దేశ వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 80 శాతం ఫీజు రాయితీతో ఈ కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పించారు...

National Skill Academy: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ శిక్షణ..
National Skill Academy
Follow us on

నిరుద్యోగులకు నేషనల్‌ స్కిల్ అకాడమీ శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 100కిపైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ స్కిల్‌ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ పొందే సదవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా భారత దేశ వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 80 శాతం ఫీజు రాయితీతో ఈ కోర్సులు నేర్చుకునే అవకాశం కల్పించారు.

ఈ ప్రోగ్రామ్‌ ఇంటర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న వారికి లేదా పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సులను పొందొచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.nationalskillacademy.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెరుగైన ఉద్యోగాల కోసం దేశ విదేశాల్లో కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించేందుకు అవసరమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి అధునాతన కోర్సులతో పాటు 100కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ కోర్సులను అందిస్తున్నారు. ఇందులో భాగంగా డిప్లొమా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, పీజీ డిప్లొమా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌, మాస్టర్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ వంటి కోర్సులు ఇందులో ఉన్నాయి.

అలాగే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, పైథాన్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, డేవాప్స్‌ ఇంజనీరింగ్, ఫుల్‌స్టాక్‌ డెవలప్‌ మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, బ్లాక్‌ చెయిన్‌, డీప్‌ లెర్నింగ్‌, సెలీనియం, సేల్స్‌ ఫోర్స్‌, జావా, ఒరాకిల్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీస్ ఇంజనీరింగ్‌, డీప్‌ లెర్నింగ్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌, పవర్‌ బీఐ, గేమ్‌ డెవలపింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఎజైల్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సెక్యూరిటీ, వెబ్‌ డిజైన్‌, సోషల్‌ మీడియా మార్కింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి 100కి పైగా అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ కోర్సులు ఉన్నాయి.

ఈ లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత పరీక్షలను నిర్వహించి, విజయవంతంగా కోర్సులు పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికేట్‌ను అందిస్తారు. కోర్సుల ఆధారంగా వ్యవధి 2 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓబీసీ, మైనారిటీ కమ్యూనిటీలకు చెందినవారితో పాటి వికలాంగులు, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికులు వారి పిల్లలకు ఫీజులో 80 శాతం డిస్కౌంట్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం 950580050, 9505800047 నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు. ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌లో లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి అఫిలియేషన్‌ లేదా ఫ్రాంచైజ్‌ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇందుకోసం www.nationalskillacademy.in/franchiseలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.