Zodiac Signs: ఈ రాశుల వారు కోపానికి చాలా దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం..

|

Aug 17, 2022 | 10:09 AM

ప్రస్తుతం ఈ రాశుల వారిపై గ్రహాలు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Zodiac Signs: ఈ రాశుల వారు కోపానికి చాలా దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం..
Zodiac Signs
Follow us on

Astrology, Zodiac Sign: ఒక జాతకంలో ఒక రాశిచక్రం మీద కొన్ని గ్రహాల ప్రభావంతో తీవ్రమైన మార్పులు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితో ఆ రాశి గల వ్యకులు తమ కోపాన్ని నియంత్రించుకోలేక ఎన్నో తప్పులు చేస్తుంటారు. దీంతో వారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ రాశుల వారిపై గ్రహాలు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని, చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మేషం – మేష రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశికి అధిపతి కుజుడు. ఇది ధైర్యం, యుద్ధం, విధ్వంసం, కోపం మొదలైన వాటికి కూడా కారకంగా నిలుస్తుంది. మేష రాశి జాతకంలో కుజ గ్రహం ప్రభావం మొదలైనప్పుడు, ఆ వ్యక్తులు కోపంతో ఊగిపోతుంటారు.

సింహం – సింహ రాశి వారు నిర్భయంగా ఉంటారు. సూర్యుడు మీ రాశికి అధిపతి. ఇది శుభప్రదమైనప్పుడు, వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందుతాడు. మంచి నాయకుడిలా ఉంటారు. అందరినీ తన వెంట తీసుకెళ్తుంటారు. అలాంటి వ్యక్తులు చాలా ప్రజాదరణ పొందుతారు. ప్రజలు వీరి మాటలు నమ్ముతారు. అయితే ఈ రాశుల వారిపై రాహు లేదా కేతువు గ్రహాల ప్రభావం చూపిస్తే.. కోపం ఎక్కువ అవ్వడంతో తీవ్రమైన నష్టాలను చవిచూస్తారు.

ఇవి కూడా చదవండి

వృశ్చికం – వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడు. కుజుడు శుభప్రదంగా ఉన్నప్పుడు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. కానీ రాహువుతో ఎంట్రీ ఇస్తే మాత్రం, ఆ వ్యక్తులు కోపం, చిరాకుగా కనిపిస్తారు. రాహువు, కుజుడు కలయిక వలన అంగారక యోగం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో, వివాదాలు మొదలైన వాటి వల్ల నష్టపోయే అవకాశం పెరుగుతుంది.

మకరం – మకర రాశికి అధిపతి శని దేవుడు. శని కూడా న్యాయాధికారి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని అన్ని గ్రహాలలో న్యాయమూర్తి బిరుదును పొందాడు. శని చంద్రుడు లేదా ఇతర దుష్ట గ్రహంతో సంబంధంలోకి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి తన కోపం కారణంగా తీవ్రమైన నష్టాన్ని కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తులు మానసిక ఒత్తిడికి కూడా గురవుతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఊహలు, విశ్వాసలకు అనుకుగుణంగా అందించాం. ఇవి పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించి, సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.