Rohini karte: రోహిణి కార్తెలో ఎండలతో ఇబంది పడుతున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

|

Jun 01, 2024 | 10:16 AM

రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండ, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించిన నక్షత్రరాశిగా పరిగణించబడుతుంది. సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు, చంద్రుని చల్లదనం తగ్గుతుంది. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో ఈ సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రమైన వేడి ఉంటుంది.

Rohini karte: రోహిణి కార్తెలో ఎండలతో ఇబంది పడుతున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Rohini Karte
Follow us on

ప్రస్తుతం రోహిణి కార్తె జరుగుతుంది. సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వేడి రోజురోజుకీ పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోహిణి కార్తెలోని ఎండలకు రోళ్లు, రోకళ్లు పగులుతాయని పెద్దలు చెప్పిన విషయం మన మనలో మెదలాడుతూ ఉంటుంది. వేసవిలో ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే.. ఇక ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు అంటే మండుతాయి. ఈ ఏడాది రోహిణి కార్తె రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8వ తేదీతో ముగుస్తుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, తీవ్రమైన ఎండ, అగ్ని ప్రమాదాలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోహిణి నక్షత్రం చంద్రునికి సంబంధించిన నక్షత్రరాశిగా పరిగణించబడుతుంది. సూర్యభగవానుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు, చంద్రుని చల్లదనం తగ్గుతుంది. దీని కారణంగా కొన్ని ప్రదేశాలలో ఈ సమయంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా తీవ్రమైన వేడి ఉంటుంది.

రోహిణి కార్తెలో తీవ్రమైన వేడి ఉంటుంది. రోజు రోజుకీ ఎండ వేడి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఎందుకంటే ఈ సమయంలో సూర్యభగవానుడు భూమికి దగ్గరగా వస్తాడు. ఈ సమయంలో విపరీతమైన వేడి కూడా మొదలవుతుంది. ఎండల వేడి కారణంగా సాధారణ ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ప్రజలు అనారోగ్యానికి గురవుతారు.

వేడి నుండి ఉపశమనం..
రోహిణి కార్తెలో తీవ్రమైన వేడి కారణంగా ఈ సమయంలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. భూమిపై సూర్యకిరణాల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. దీని కారణంగా రోహిణి కార్తె సమయంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. రికార్డు స్థాయికి చేరుకుంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం రోహిణి కార్తె 2024 జూన్ 8 న ముగుస్తుంది. దీంతో త్వరలో మండే వేడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఉష్ణోగ్రత తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

రోహిణి కార్తెలో ఈ పని చేస్తే జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది.
ఇంత వేడి ఎందుకు అని విష్ణు పురాణంలో కూడా చెప్పబడింది. వేసవిలో భూమిపై ఉష్ణోగ్రతలు నిరంతరం పెరగడానికి అనేక శాస్త్రీయ కారణాలు చెబుతున్నారు. అయితే హిందూ పురాణాలలో కూడా భూమిపై వేడి పెరుగుదల గురించి ప్రస్తావించబడింది. దీనికి కారణం కూడా వివరించబడింది. విష్ణు పురాణం, సుఖ సాగర గ్రంథం ప్రకారం కలియుగం దాని ముగింపు వైపు కదులుతున్నప్పుడు, విశ్వంలో గొప్ప విపత్తులు సంభవిస్తాయి. భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమి అగ్ని బంతిలా కాలిపోతుంది. వేడి కారణంగా ప్రజల జీవితంలో గందరగోళం ఉంటుంది. వర్షం కురిసి ఉపశమనం లభిస్తుందని.. వర్షం కోసం ఆరాటపడతారు.

అయితే గత ఏళ్లుగా వానలు సరిగ్గా కురవకపోవడంతో భూమిపై కరువు తాండవిస్తోంది. అప్పుడు విష్ణువు సూర్య భగవానుడి రంగుల కిరణాలలో శోషించబడతాడు. దీని కారణంగా వేడి స్థాయి మరింత పెరుగుతుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పూర్తిగా నాశనమై భూమిపై భయంకరమైన కరువు ఏర్పడుతుంది. విపరీతమైన వేడి, వర్షాభావ పరిస్థితుల కారణంగా నదులు, చెరువులు, జలాశయాలు అన్నీ ఎండిపోతాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు