Garuda Purana: ఎవరింట్లో భోజనం చేస్తే అదృష్టం, ఎవరింట్లో చేస్తే దురదృష్టం? గరుడ పురాణం చెప్పిన రహస్యం!

Food and Spirituality: గరుడ పురాణం ప్రకారం ఆహారం కేవలం ఆకలి తీర్చే సాధనం మాత్రమే కాదు, అది మన ఆధ్యాత్మిక శక్తులపై కూడా ప్రభావం చూపుతుంది. ఎవరింట్లో భోజనం చేయాలి, ఎవరింట్లో చేయకూడదు, భోజనం ముందు నైవేద్యం ఎందుకు సమర్పించాలి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.

Garuda Purana: ఎవరింట్లో భోజనం చేస్తే అదృష్టం, ఎవరింట్లో చేస్తే దురదృష్టం? గరుడ పురాణం చెప్పిన రహస్యం!
Garuda Purana Food Rules

Updated on: Jun 17, 2026 | 10:53 AM

Garuda Purana Food Rules: హిందూ ధర్మంలో ఆహారాన్ని కేవలం ఆకలి తీర్చే సాధనంగా కాకుండా, దైవిక శక్తిని ప్రసాదించే పవిత్ర సాధనంగా భావిస్తారు. అందుకే గరుడ పురాణం (Garuda Purana) ఆహారం విషయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను సూచించింది. మనం ఏ ఇంట్లో భోజనం చేయాలి? ఎక్కడ భోజనం చేయకూడదు? ఆహారం మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలను ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణుడు డాక్టర్ బసవరాజ్ గురూజీ తన ఆధ్యాత్మిక ప్రసంగంలో వివరించారు.

సాధారణంగా దేవాలయాల్లో లభించే ప్రసాదాన్ని దైవ అనుగ్రహంగా భావిస్తారు. దేవునికి నైవేద్యంగా సమర్పించిన ఆహారాన్ని భక్తితో స్వీకరించినప్పుడు అది శరీరానికే కాదు, మనసుకు కూడా పవిత్రతను అందిస్తుందని విశ్వాసం. అయితే గరుడ పురాణం ఆహారం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మరింత లోతుగా వివరిస్తుంది.

పురాణాల ప్రకారం, మనం తీసుకునే ఆహారం కేవలం శరీరానికే కాదు, మనలోని పంచభూతాలు, సప్తచక్రాలపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల ఆహారం ఎలా తయారైంది, ఎవరు వడ్డించారు, వారి ఆలోచనా విధానం ఎలా ఉంది అనే అంశాలు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. మనం ఆహారాన్ని నోటితో స్వీకరించినప్పటికీ, దాని ప్రభావాన్ని మన అంతర్గత శక్తులు గ్రహిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అలాంటి వారి ఇంట్లో భోజనం చేయకూడదట!

గరుడ పురాణం ప్రకారం దుర్మార్గులు, మోసగాళ్లు, అన్యాయ మార్గాల్లో సంపాదించినవారు, అధిక వడ్డీలు వసూలు చేసేవారు, ఇతరులను హింసించేవారు, జంతువులు, పక్షులు, వృద్ధులను నిర్లక్ష్యం చేసేవారి ఇళ్లలో భోజనం చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే భార్య, పిల్లలపై హింస ప్రదర్శించే వారు, భూకబ్జాలు చేసే వారు, సమాజానికి హాని కలిగించే వ్యక్తుల ఇంట్లో ఆహారం స్వీకరించడం వల్ల వారి ప్రతికూల కర్మ ప్రభావం మనపై పడే అవకాశం ఉందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

ఎవరింట్లో భోజనం చేస్తే శుభం?

నిజాయితీగా జీవించే వారు, కష్టపడి సంపాదించే వారు, ధర్మమార్గంలో నడిచే వారి ఇంట్లో భోజనం చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. అలాంటి గృహాలను దైవ నివాసాలుగా గరుడ పురాణం పేర్కొంటుంది. అక్కడ లభించే ఆహారం శరీరానికి పోషణతో పాటు మనసుకు సానుకూల శక్తిని అందిస్తుందని నమ్మకం.

భోజనం ముందు నైవేద్యం ఎందుకు?

భోజనం చేయడానికి ముందు ఆహారాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించడం ఉత్తమ ఆచారంగా శాస్త్రాలు పేర్కొంటాయి. ఇలా చేయడం ద్వారా ఆహారం పవిత్రమై, దైవ అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం గరుడ పురాణం, మత విశ్వాసాలు, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us