Vastu Tips: ఇంట్లో డబ్బు కొరత ఉందా.. ఉత్తరం వైపున ఈ వస్తువులు లేవని అర్థం..?

|

Feb 21, 2022 | 4:12 PM

Vastu Tips: ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే లక్ష్మిమాతని పూజించాలి. అందుకోసం పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఇవన్ని చేసినా కూడా కొన్నిసార్లు

Vastu Tips: ఇంట్లో డబ్బు కొరత ఉందా.. ఉత్తరం వైపున ఈ వస్తువులు లేవని అర్థం..?
Bed Room Vastu Tips
Follow us on

Vastu Tips: ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే లక్ష్మిమాతని పూజించాలి. అందుకోసం పూజలు, ఉపవాసాలు చేస్తారు. ఇవన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఉండదు. డబ్బుల సమస్య వేధిస్తూ ఉంటుంది. అప్పులతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి వాస్తు దోషం కారణం కావొచ్చు. ఇల్లు కట్టడం ముఖ్యం కాదు.. దానిని వాస్తు ప్రకారం నిర్మించారా లేదా అనేది ముఖ్యం. వాస్తు లోపాలుంటే చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం

వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించుకంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉండవు. ఇంటి ప్రధాన ద్వారం సరైన దిశలో లేకుంటే అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయి. ఎప్పుడైనా ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండాలి. అప్పుడే లక్ష్మి మాత అనుగ్రహం లభిస్తుంది.

గాజు వస్తువులు

ఇంట్లో గాజు వస్తువుల దోషాలు కూడా ఉంటాయి. అద్దం సరైన దిశలో ఉంచకపోతే కుటుంబంలో సమస్యలు ఏర్పడుతాయి. అది డబ్బు కొరతకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి అద్దం ఉత్తరం వైపున ఉండాలి. ఇది శుభప్రదంగా భావిస్తారు.

మనీ ప్లాంట్

ఇంట్లో మనీ ప్లాంట్ ఉండటం చాలా మంచిది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే ఆ ఇంట్లో ఆనందం-శ్రేయస్సు అంతగా వృద్ధి చెందుతాయి. మనీ ప్లాంట్‌ను నాటడం ద్వారా ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. అనేక చింతలు తొలగిపోతాయి. మనీ ప్లాంట్‌ను ఇంట్లో ఉత్తరం వైపు ఉంచాలని గుర్తుంచుకోండి.

వంటగది

వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగది ఉత్తరం వైపున ఉండాలి. ఇలా ఉంటే మంచిదంటారు. అన్నపూర్ణ దేవి ఎల్లప్పుడు ఇక్కడే ఉంటుందని నమ్ముతారు. ఆహార కొరత ఎప్పుడూ ఉండదంటారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం వాస్తు ప్రకారం, మత విశ్వాసాల ఆధారంగా ఉంటుంది. సాధారణ పాఠకులని ఉద్దేశించి రాయడం జరిగింది.

Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 4 పదార్థాలు నమిలితే మటుమాయం..

Iron Deficiency: ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారా.. ఈ రెండు ఆహారాలు కలిపి తింటే చాలు..!

Weather: తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు.. రాత్రిపూట తగ్గిన చలి తీవ్రత.. హైదరాబాద్‌లో ఎలా ఉందంటే..?