Viral Video: త్రిమూర్తుల్లో ఒకరు లయకారుడు శివయ్య లీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. దేశవిదేశాల్లో ప్రసిద్ధిచెందిన శివాలయాలు అనేకం ఉన్నాయి. సహజంగా మంచుతో ఏర్పడే శివలింగం మాత్రం.. అమరనాథ్ లో మాత్రమే ఉంది. దీంతో శివయ్యను దర్శించుకుని పూజాదికార్యక్రమాలు నిర్వహించడానికి దేశవిదేశాల భారీ సంఖ్యలో భక్తులు ఎన్నో కష్టాలకు ఓర్చుకుని అమరనాథ్ కు చేరుకుంటారు.. అయితే తాజాగా మరో ప్రసిద్ధిచెందిన శివాయలయంలో మహా అద్భుతం చోటు చేసుకుంది. ఆలయంలోని శివలింగంపై మంచు ఏర్పడింది.. ఇది చూసిన పూజారులు, భక్తులు అంతా లయకారుడి మహిమే అని అంటున్నారు. ఈ అద్భుతమైన ఘటన మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో జరిగింది. వివరాలోకి వెళ్తే..
గోదావరి నది జన్మస్తానం.. నాసిక్ జిల్లాలోని ప్రసిద్ధ త్రయంబకేశ్వర ఆలయంలో శివలింగానికి ముందుగా అర్చకులు పువ్వులతో పూజలను చేశారు. అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో లింగం పై తెల్లని మంచు ఏర్పడింది.. లింగంపై మంచుని చూసిన పూజారులు, భక్తులు, పూజారులు ‘అద్భుతం’గా పేర్కొంటున్నారు. అంతా శివయ్య మహిమే అని అంటున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఇలా శివలింగం మధ్యలో మంచు ఏర్పడలేదని అంటున్నారు.
त्र्यंबकेश्वर मंदिर ज्योतिर्लिंगातील महादेवाच्या स्वयंभू शिवलिंगात बर्फ गोठला हा एक नैसर्गिक चमत्कार आहे, तो कधीच घडला नाही अमरनाथ यात्रेला आजपासून सुरुवात झाली असून, त्र्यंबकराजमध्ये देवानेच भक्तांना दर्शन दिल्याची लोकांची श्रद्धा आहे. ❤️? pic.twitter.com/XVFf6VXGuU
— Narendra Aher ? (@aher_narendra) July 1, 2022
ఆలయంలో పూజారులు ప్రార్థనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పూజారి మంచు శివలింగాన్ని పూజించడం చూడవచ్చు. లింగం చుట్టూ పువ్వులు ఉన్నాయి. ఈ వీడియోను ‘నరేంద్ర అహెర్’ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమరనాథ్ యాత్ర మొదలైన సందర్భంలో త్రయంబకేశ్వర ఆలయంలోని శివలింగంపై మంచుగడ్డ ఏర్పడటమనేది మహా అద్భుతమని, అది శివుని మహిమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..