Vastu Tips: ఇంటి నంబర్ మీ అదృష్ట తాళాన్ని తెరవగలదు.. ఒకొక్క నెంబర్‌కి ఒకొక్క శక్తి.. దీని రహస్యం ఏమిటంటే

వాస్తు మనిషి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని చర్చిస్తుంది. అలాంటి ముఖ్యమైన అంశంలో ఇల్లు ఒకటి. వాస్తు ప్రకారం ఇంటి నంబర్, అదృష్టం మధ్య సంబంధం ఉంది. ఇంట్లో నివసించే వ్యక్తుల విజయవంతమైన కలయిక. ఇంటి నంబర్ మనిషి జీవితంలో అదృష్ట తాళాలను తెరవగలదని వాస్తు నమ్ముతుంది. ఇంటి నెంబర్ అదృష్ట సంఖ్య మధ్య సంబంధం చెదిరినా, సమతుల్యత లోపిమ్చినా జీవితంలో సమస్యలను సృష్టించగలదు.

Vastu Tips: ఇంటి నంబర్ మీ అదృష్ట తాళాన్ని తెరవగలదు.. ఒకొక్క నెంబర్‌కి ఒకొక్క శక్తి.. దీని రహస్యం ఏమిటంటే
Vastu Tips For Home

Updated on: Jun 13, 2025 | 10:49 AM

సంఖ్యాశాస్త్రం, వేద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ఒకదానికొకటి సామరస్యంగా ఉంటాయి. సంఖ్యాశాస్త్రంలో కూడా ఇంటి సంఖ్య, వ్యక్తి జాతకం కలయిక గురించి చర్చ జరుగుతుంది. కనుక వాస్తు ప్రకారం ఏ సంఖ్య గల ఇంట్లో నివసించడం వల్ల మీరు ఎలాంటి ఫలితాలను పొందుతారో ఈరోజు తెలుసుకుందాం..

సంఖ్య 1

వాస్తు ప్రకారం నంబర్ వన్ గురించి మాట్లాడుకుంటే.. నంబర్ వన్ ఇంట్లో నివసించే వారు స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఈ ఇల్లు బ్యాచిలర్లకు సరైనదని చెబుతారు ఎందుకంటే వీరు స్వాతంత్ర్యాన్ని ఇష్టపడతారు. అలాంటి ఇంట్లో నివసించే వ్యక్తులు తమ కుటుంబం కంటే తమ కెరీర్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఈ ఇంట్లో నివసించే వ్యక్తులు స్వావలంబన కలిగి ఉంటారు.

ఇవి కూడా చదవండి

సంఖ్య 2

వాస్తు శాస్త్రం ప్రకారం రెండవ సంఖ్య ఇల్లు అంత శుభప్రదమైనది కాదు. ఈ ఇంట్లో అశాంతి , ఉద్రిక్తత ఉంటుంది. ఇంట్లో ఎవరో ఒకరు చిరాకు పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో మీ జాతకంతో సరిపోలిన తర్వాతే రెండవ సంఖ్య ఇంటిని కొనుగోలు చేయాలి.

నం. 3

మూడవ సంఖ్య గురించి మాట్లాడుకుంటే ఈ సంఖ్య సృజనాత్మకత, సామాజికతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కళ లేదా మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ ఇంట్లో నివసిస్తుంటే.. వారికి చాలా మంచిది. ఈ ఇల్లు అందులో నివసించే వ్యక్తులకు కమ్యూనికేషన్‌లో సహాయపడుతుంది.

సంఖ్య 4

నాల్గవ నంబర్ ఇంటి గురించి మాట్లాడుకుంటే.. వాస్తు దృక్కోణం నుంచి ఇది అంత అనుకూలమైనదిగా పరిగణించబడదు. అందులో నివసించే వ్యక్తి అదృష్టం అంతగా పనిచేయదు. అందులో నివసించే వ్యక్తులు కొంచెం నీరసంగా మారతారని కూడా చెబుతారు.

సంఖ్య 5

ఐదవ నంబర్ ఇంట్లో నివసించే ప్రజలు ఎల్లప్పుడూ ముందుకు సాగాలని కోరుకుంటారు. ఇలాంటి ఇళ్లలో తరచుగా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఇంట్లో నివసించే వ్యక్తులు స్నేహశీలియైనవారు అవుతారు. స్నేహితులు, సన్నిహితులు వీరి ఇంటికి వస్తూ పోతూ ఉంటారు. వినోదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఇంట్లో నివసించే ప్రజలు మార్పును ఇష్టపడతారు.

సంఖ్య 6

6వ సంఖ్య గల వ్యక్తులు ఎల్లప్పుడూ ఒకరినొకరు ప్రేమిస్తారు. ఈ సంఖ్య కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది. ఈ సంఖ్య గల ఇంట్లో నివసించే కుటుంబ సభ్యులను స్త్రీ ఎల్లప్పుడూ పాలిస్తూ ఉంటుంది.

సంఖ్య 7

ఏడవ ఇంట్లో నివసించే వ్యక్తుల ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. ఈ ఇల్లు జ్ఞానం, విజ్ఞానాన్ని పెంచుతుందని భావిస్తారు. దీనిలో నివసించడం వల్ల ఆధ్యాత్మికత , మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సంఖ్య 8

ఎనిమిదవ నంబర్ ఇల్లు కూడా వాస్తు ప్రకారం అంత మంచిది కాదు. ఈ ఇంట్లో నివసించే వ్యక్తుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. సంబంధాలలో అంత మాధుర్యం ఉండదు. ఈ ఇంట్లో నివసించే వ్యక్తులు ఎక్కువగా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీరికి ఆశయాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

తొమ్మిది

తొమ్మిదవ సంఖ్య లో నివసించే వ్యక్తులు తరచుగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. తమ శక్తిని ఎక్కువగా విశ్వసిస్తారు. వీరు ఏ పని చేపట్టినా విజయవంతమవుతారు. 6వ సంఖ్య లాగానే కళాకారులు, మేధావులు ఇక్కడ నివసించడం చాలా అనుకూలంగా ఉంటుందని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.