Vastu Tips: మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే డబ్బుకు అస్సలు లోటు ఉండదు.. అవేంటో తెల్సా

ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రాన్ని చైనీయులు ఆచరిస్తారు. ఇక ఈ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఆనందంతో పాటు అభివృద్ధి ఉండాలంటే.. కచ్చితంగా ఈ వస్తువులు ఉండాలట. ఇవి నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వ్యాపింపజేస్తాయి.

Vastu Tips: మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంచితే డబ్బుకు అస్సలు లోటు ఉండదు.. అవేంటో తెల్సా
Vastu Tips
Follow us

|

Updated on: Jul 16, 2024 | 8:41 PM

ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రాన్ని చైనీయులు ఆచరిస్తారు. ఇక ఈ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఆనందంతో పాటు అభివృద్ధి ఉండాలంటే.. కచ్చితంగా ఈ వస్తువులు ఉండాలట. ఇవి నెగటివ్ ఎనర్జీని దూరం చేసి.. చుట్టూ పాజిటివ్ ఎనర్జీ వ్యాపింపజేస్తాయి. అలాగే ఈ వస్తువులను మీ ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. మరి అవేంటో తెలుసుకుందామా..

ఇది చదవండి: మొబైల్ పట్టుకునే స్టైల్ బట్టి.. మీరు ఎలాంటివారో చెప్పొచ్చు.. ఎలాగో తెల్సా

తాబేలు –

పురాణాల ప్రకారం తాబేలు విష్ణు స్వరూపమని నమ్ముతారు. విష్ణుమూర్తి దశావతారాలలో కూర్మావతారం కూడా ఉంది. అంతే కాదు, ఫెంగ్ షుయ్ ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటి ఉత్తర దిక్కు.. సంపదకు దేవుడు అయిన కుబేరునితో సంబంధం కలిగి ఉంటుంది. కావున తాబేలును అక్వేరియంలో ఉత్తరం వైపు ఉంచితే ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్తర దిశలో తాబేలును ఉంచితే కుబేరుని అనుగ్రహం లభిస్తుంది. తాబేలు ఉన్నచోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

లాఫింగ్ బుద్ధ-

చైనీస్ వాస్తు శాస్త్రం ప్రకారం.. లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో ఉంచడం శుభపరిణామంగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధను మీ ఇంట్లో ఉంచుకుంటే ఆ ఇల్లు ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధను సాధారణంగా ప్రధాన ద్వారం ముందు ఉంచుతారు. ఇలా చేస్తే ఇంట్లోకి అడుగుపెట్టగానే మీ కళ్లు నవ్వుతున్న బుద్ధుడిపై పడతాయి. ఇది ఇంటికి ఆనందం, అదృష్టం, ఆర్థిక లాభం తెస్తుందని నమ్ముతారు.

ఇది చదవండి: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే

అక్వేరియం –

ఇంట్లో చేపల అక్వేరియం ఉంటే డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. చేపల అక్వేరియం ఉంచడం కూడా వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా పేర్కొనబడింది. మీరు ఆర్థికంగా బలహీనంగా ఉంటే మీ ఇంటికి ఫిష్ అక్వేరియం తీసుకురండి. ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచడం వల్ల ఇంట్లో పేదరికం తొలగిపోతుంది. కానీ అక్వేరియంలో చేపల సంఖ్య కూడా చాలా ముఖ్యమైనది. గోల్డ్ ఫిష్ ఉంచడం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారని నమ్ముతారు.

మనీ ప్లాంట్-

ఈ మొక్కను కుబేర మొక్క అంటారు. ఇది చాలా అన్ని చోట్లా చాలా ఫేమస్. చిన్న ఆకులు కలిగిన ఈ పచ్చటి మొక్క చాలా అదృష్టంగా భావిస్తారు. ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ మొక్కను ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుందని నమ్ముతారు. ఈ మొక్క ఆక్సిజన్‌ను పెంచడమే కాకుండా ఆనందాన్ని వెదజల్లుతుందని నమ్మకం.

చైనీస్ నాణేలు –

ఫెంగ్ షుయ్ శాస్త్రంలో చైనీస్ నాణేలు చాలా ముఖ్యమైనవి. ఈ నాణేలను ఎర్రటి గుడ్డలో చుట్టి, వాటిని సురక్షితంగా ఉంచడం వల్ల పేదరికాన్ని దూరం చేయడమే కాదు.. ఆనందం, సంపద లభిస్తాయని నమ్ముతారు. వాటిని ఇంట్లో వేలాడదీయడం లేదా పజా గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ప్రచురించబడింది. ఈ వార్తలోని సమాచారం సోషల్ మీడియా, మత గ్రంధాల ద్వారా సేకరించబడినది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు)

పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ
మీడియాలో వస్తున్నవార్తలపై బీఆర్‌ఎస్‌ స్పందించాలి: ఓవైసీ