రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదంటోన్న గోవా సుందరి.. కారణం ఇదే

Rajeev 

16 July 2024

ఒకానొక సమయంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా రాణించింది గోవా బ్యూటీ ఇలియానా.

రామ్ పోతినేని హీరోగా నటించిన దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది.

ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి ఇండస్ట్రీ హిట్‌తో ఈ బ్యూటీ క్రేజ్‌ టాలీవుడ్లో అమాంతంగా పైకి లేచింది.

దాంతో వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండా వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా రాణించింది.

ఇక తెలుగులో పీక్ స్టేజ్ లో ఉండగానే బాలీవుడ్ వైపు అడుగులేసింది ఈ అమ్మడు.

కానీ బాలీవుడ్ లో అంతగా సక్సెస్ కాలేకపోయింది. అదే సమయంలో ప్రేమలో పడటం బ్రేకప్ అవ్వడం కూడా జరిగిపోయింది.

ఇప్పుడు ఇలియానా మరొకరితో లివిన్ రిలేషన్ లో ఉంది. ఇటీవలే వీరికి బిడ్డకూడా జన్మించింది. తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో మాతృత్వవాన్ని ఎంజాయ్ చేస్తున్న.. బిడ్డ వల్ల సరిగా నిద్రకూడా పోవడం లేదు అని రాసుకొచ్చింది.