ఆవాలలో మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. శరీరానికి పోషణ లభిస్తుంది.
ఒంట్లో చల్లదనంతో కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగించిన సందర్భాల్లో ఆవాలు గొప్పగా పని చేస్తాయి. ఇవి ఆమాన్ని కలిగించి వాతాన్ని క్రమపద్ధతిలోకి తెస్తాయి. నొప్పిని, వాపుని నిరోధిస్తాయి.
ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. వీటిలో ఉండే మ్యూసిలేజ్ అనే చిక్కటి పదార్థం విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.
ఆవాలలో ఉండే కాపర్, ఐరన్, మెగ్నిషియం, సెలీనియంలు హైబీపీని తగ్గిస్తాయి. ఆస్తమా ఉన్నవారు ఆవాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఆవాలలో విటమిన్ ఏ, సీ, కే లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. శరీర కణజాలాన్ని రక్షిస్తాయి. ఫంగస్, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారికి ఆవాలు బెస్ట్ మెడిసిన్.
ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను గుర్తించి నాశనం చేస్తుంది. ఆవాల నుంచి తీసిన నూనెలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండి జుట్టు పెరిగేందుకు దోహదపడుతుంది.
సోరియాసిస్‌ను కట్టడి చేయడంలో ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే కెరోటిన్స్, లూటిన్, విటమిన్ ఏ, సీ, కే యాంటీఏజింగ్ గా పనిచేస్తాయి. అయితే, ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
వీటిలోని ఘాటైన ద్రవ్యాలు మనకు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకోవడం ఉత్తమం.