Tail Strike: సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! విమానం తోక భాగం నేలపై..
దక్షిణ అమెరికాకు చెందిన లాతమ్ ఎయిర్ లైన్స్ విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటలీలోని మిలాన్ మాల్ పెన్సా ఎయిర్ పోర్టు నుంచి బోయింగ్ 777 రకానికి చెందిన విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో దాని తోక భాగం రన్ వేను తాకింది. అలా కొన్ని వందల మీటర్ల దూరంపాటు రన్ వేను ఒరుసుకుంటూనే విమానం ముందుకు దూసుకెళ్లింది. ఈ సమయంలో దట్టమైన పొగలు వచ్చాయి. నిప్పు రవ్వలు కూడా వచ్చినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
దక్షిణ అమెరికాకు చెందిన లాతమ్ ఎయిర్ లైన్స్ విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటలీలోని మిలాన్ మాల్ పెన్సా ఎయిర్ పోర్టు నుంచి బోయింగ్ 777 రకానికి చెందిన విమానం టేకాఫ్ అయ్యే క్రమంలో దాని తోక భాగం రన్ వేను తాకింది. అలా కొన్ని వందల మీటర్ల దూరంపాటు రన్ వేను ఒరుసుకుంటూనే విమానం ముందుకు దూసుకెళ్లింది. ఈ సమయంలో దట్టమైన పొగలు వచ్చాయి. నిప్పు రవ్వలు కూడా వచ్చినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జులై 9 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎయిర్ పోర్టులోని నిఘా కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయినప్పటికీ విమానం సురక్షితంగానే గాల్లోకి ఎగిరింది.
అనంతరం విమాన పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ను సంప్రదించారు. ఎయిర్ పోర్టులో తిరిగి అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరారు. అయితే విమానం నిండా ఇంధనం ఉండటంతో సుమారు గంటా పది నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత అందులోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే కిందకు దిగారు. వాస్తవానికి ఈ విమానం బ్రెజిల్ లోని సావోపాలోకు చేరుకోవాల్సి ఉంది. ఘటనపై నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై నిపుణులు స్పందిస్తూ ఆ సమయంలో పైలట్లు ఒకవేళ టేకాఫ్ ను రద్దు చేసుకొని ఉండి ఉంటే భయంకరమైన పరిణామాలు చొటుచేసుకొని ఉండేవని అభిప్రాయపడ్డారు. వాళ్లు విమానాన్ని సరిగ్గా నడిపి ఉండేవాళ్లు కాదని ఓ స్థానిక వార్తాసంస్థతో మాట్లాడుతూ చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు

వంద స్పీడ్తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచాడు..

ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
