
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. జీవితకాల కష్టార్జితంతో నిర్మించుకునే ఇంట్లో సుఖశాంతులు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకే ఇల్లు కట్టేటప్పుడు వాస్తు నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే స్థలం ఆదా చేసే క్రమంలో చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు మెట్ల కింద ఉన్న ఖాళీ స్థలాన్ని ఇష్టానుసారంగా వాడటం. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద ఖాళీ స్థలం చాలా సున్నితమైనది. అక్కడ చేసే చిన్న పొరపాటు వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించే అవకాశం ఉంది.
పూజ గది: చాలామంది స్థలం లేక మెట్ల కింద దేవుడిని పెడతారు. కానీ మెట్లపై నుంచి మనం నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి దేవుడి పైన నడవడం అశుభం చెబుతారు. ఇది ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తుంది.
వంటగది: మెట్ల కింద వంటగది ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అగ్ని మూలకానికి మెట్ల కింద స్థలం సరికాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
టాయిలెట్ – బాత్రూమ్: నీటితో సంబంధం ఉన్న నిర్మాణాలు మెట్ల కింద ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
చెప్పుల స్టాండ్: మెట్ల కింద పాత వస్తువులను పారేయడం లేదా చెప్పుల స్టాండ్ పెట్టడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి ఆందోళనలకు దారితీస్తుంది.
స్టోర్ రూమ్: మీరు నిత్యం వాడని వస్తువులను భద్రపరుచుకోవడానికి క్లోజ్డ్ స్టోర్ రూమ్ నిర్మించుకోవచ్చు.
అదనపు నిల్వ: మెట్ల కింద కబోర్డ్స్ వేయించి అవసరమైన పత్రాలు లేదా ఇతర వస్తువులను జాగ్రత్త చేయవచ్చు. అయితే అది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ఇంటి ప్రతి మూల ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలి. మెట్ల కింద తప్పుడు నిర్మాణాలు చేపడితే అవి మీ అభివృద్ధిని అడ్డుకోవచ్చు. కాబట్టి, ఇల్లు కట్టేటప్పుడు లేదా మార్పులు చేసేటప్పుడు ఈ వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకోవడం శ్రేయస్కరం.