ఇంట్లో సిరిసంపదలు సుఖ సంతోషాలు ఉండలా.. వరుథిని ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. విష్ణువు అనుగ్రహం మీ సొంతం..

|

Apr 29, 2024 | 7:54 AM

ప్రపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈసారి చైత్ర మాసంలోని వరుథిని  ఏకాదశిని మే 4వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. వరుథిని ఏకాదశి రోజున దానం చేయడం గొప్ప విశిష్ట ఫలితాలను ఇస్తుంది చెబుతారు. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి రోజున ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం..

ఇంట్లో సిరిసంపదలు సుఖ సంతోషాలు ఉండలా.. వరుథిని ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. విష్ణువు అనుగ్రహం మీ సొంతం..
Varuthini Ekadashi 2024
Follow us on

చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీని వరుథిని ఏకాదశి లేదా బరుతని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు హిందువులకు అత్యంత పవిత్ర పర్వదినం. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం ఉంది. ఈసారి చైత్ర మాసంలోని వరుథిని  ఏకాదశిని మే 4వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. వరుథిని ఏకాదశి రోజున దానం చేయడం గొప్ప విశిష్ట ఫలితాలను ఇస్తుంది చెబుతారు. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి రోజున ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకుందాం.

వరుథిని ఏకాదశి రోజున చేయాల్సిన దానాలు ఏమిటంటే..

అన్న వితరణ: వరుథిని ఏకాదశి నాడు అన్నదానం చేయడం వల్ల మానవులు, దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. వరుథిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా ఫలం లభిస్తుంది. అన్నపూర్ణ దేవి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా సంతోషిస్తుంది.దీని వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు నెలవుగా ఉంటుంది. అలాగే, మీ ఇంట్లో సుఖ శాంతులు ఉంటాయి.

దాహార్తిని తీర్చడం: వరుథిని ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ రోజున బాటసారులకు నీరు ఇచ్చినా శుభఫలితాలు లభిస్తాయి. పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారని, వారికి ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మకం.

ఇవి కూడా చదవండి

నువ్వుల దానం: హిందూ మత విశ్వాసం ప్రకారం నువ్వులు శ్రీ హరి నుండి ఉద్భవించాయి. ఏకాదశి రోజున నల్ల నువ్వులను నీటిలో వదలడం వల్ల శ్రీ హరి, శనిస్వరుడు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. అదే సమయంలో ఈ రోజున నువ్వులతో చేసిన స్వీట్లను దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.

సత్తు పిండి దానం: సత్తు అంటే వేయించిన శనగల పొడ.. చైత్ర, వైశాఖ మాసంలో వేసవికాలం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి నాడు సత్తు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ధనలాభం చేకూరుతుందని, అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు.

పండ్ల దానం: ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆకలి అన్నవారికి అరటి, మామిడి పండ్లను లేదా ఇతర పండ్లను దానం చేయవచ్చు. ఇది పితృ దోషం నుండి బయటపడటానికి సహాయపడుతుందని నమ్ముతారు. శని దోష నివారణ జరుగుతుందని విశ్వాసం.

పాదరక్షలు, చెప్పుల దానం: మీరు ఏకాదశి రోజున బూట్లు, చెప్పులు లేదా గొడుగును కూడా దానం చేయవచ్చు. ఈ రోజున ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేస్తారో.. వారిపై శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి కష్టం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.

ధనాన్ని దానం చేయడం: వరుథిని ఏకాదశి రోజున దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వరుథిని ఏకాదశి రోజున ఎవరైనా దేవాలయంలో గాని, ఏదైనా ధర్మకార్యానికి గాని తమ శక్తి మేరకు ధనాన్ని విరాళంగా ఇవ్వాలని చెబుతారు.

వస్త్రదానం: వరుథిని ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం కూడా మంచిదని భావిస్తారు. ఈ రోజున ఆలయంలో దేవుని పాదాల వద్ద వస్త్రాలు సమర్పించి, ఆ వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది.

పూలను దానం చేయడం: పసుపు పువ్వులు విష్ణువుకు ఇష్టమైనవి. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి రోజున మహావిష్ణువుకు బంతి పువ్వులను సమర్పించి, ఆ తర్వాత కొన్ని పుష్పాలను కూడా దానం చేయండి. ఇక్కడ పుష్పాలను దానం చేయడం అంటే దేవాలయంలో దేవుడి సేవలో పూలను ఉంచడం. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో మధురానుభూతి మిగులుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు