మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.! కచ్చితంగా జరిగేది ఇదే

10వ తేదీన పుట్టిన వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, పట్టుదల లాంటి గొప్ప లక్షణాలు ఉంటాయని న్యూమరాలజిస్ట్ చెప్పారు. వీరిపై సూర్యుడి అనుగ్రహం ఉంటుందని పేర్కొన్నారు. వీరికి 2026వ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉంటుందని, పేరు, ప్రతిష్టలు, ఐశ్వర్యం లభిస్తాయని సూచించారు.

మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.! కచ్చితంగా జరిగేది ఇదే
Telugu News

Updated on: Dec 21, 2025 | 12:20 PM

మీ పుట్టిన తేదీ 10 హ.! 10వ తేదీన పుట్టిన వ్యక్తులకు వచ్చే సంవత్సరం అద్భుతంగా ఉంటుందని.. ఆ సంఖ్యలో 1 సూర్యుడిని, 0 సంపూర్ణత్వాన్ని సూచిస్తుందని న్యూమరాలజిస్ట్ పేర్కొన్నారు. 10వ తేదీన పుట్టిన వారికి సూర్యుడి ఆశీస్సులు ఉంటాయని.. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, పట్టుదల, సృజనాత్మక ఆలోచనలు, ఆత్మగౌరవం కలిగి ఉంటారని చెప్పారు. వీరు ఎవరికీ తలవంచరు, ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఎలాంటి రిస్క్‌లనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ఈ రిస్క్‌ల ద్వారానే గొప్ప విజయాలు సాధిస్తారు. వీరు పుట్టుకతోనే నాయకులు, పెద్ద పెద్ద పనులు చేస్తారు. ప్రపంచాన్ని తమవైపు ఆకర్షించే శక్తి వీరికి ఉందని తెలిపారు. దర్శకుడు రాజమౌళి(అక్టోబర్ 10న) నటుడు బాలకృష్ణ(జూన్ 10న) ఇందుకు నిదర్శనం అని చెప్పారు.

ఇది చదవండి: మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది.. 10 నిమిషాల్లోనే.!

10వ తేదీన పుట్టినవారు తమ పేరులోని అక్షరాల సంఖ్య, ముఖ్యంగా 6 లేదా 8 సంఖ్యలు లేకుంటే, వారిని ఆపే శక్తి ఎవరికీ ఉండదు. వీరికి 2026వ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. 2026 సంఖ్య మొత్తం 10 అవుతుంది. అది 1+0= 1. కాబట్టి 10వ తేదీన పుట్టిన వారికి ఈ సంవత్సరం మరింత శక్తిని ఇస్తుంది. వీరు ఏం చేసినా విజయం సాధిస్తారు. ఎక్కడ డబ్బులు పెట్టినా అవి రెండింతలు, మూడింతలు అవుతాయి. పేరు, ప్రతిష్టలు, కీర్తి, మంచి ఆరోగ్యం, సంపద, బలమైన సంబంధాలు ఈ సంవత్సరంలో లభిస్తాయని వివరించారు. ప్రతి నెలా 6, 15, 24 తేదీలలో దూర ప్రయాణాలు చేయవద్దని అన్నారు. 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 లాంటి అంకెలు తప్పితే.. 2026లో వీరు పట్టిందల్లా బంగారమని, ఆకాశమే హద్దు అని ఉద్ఘాటించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: నన్నైతే అమ్మ, తమ్ముడు ముందే బట్టలు విప్పి చూపించమన్నారు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..