TTD Tickets: 28వ తేదీన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. పూర్తి వివరాలివే..

TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది.

TTD Tickets: 28వ తేదీన తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు.. పూర్తి వివరాలివే..
Ttd Temple

Updated on: Jan 26, 2022 | 9:28 PM

TTD Tickets: తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు(Devotees) తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(TTD) శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను(Tickets) ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 28వ తేదీన ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లు జారీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ఈ నెల 29వ తేదీన రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఫిబ్రవరి నెలలో దర్శనం టికెట్లను పెంచుతారని అంతా ఆశించారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో దర్శనం టికెట్లను పెంచలేదని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పక పాటించాలని స్పష్టం చేశారు. లేదంటే తిరుమలలోకి ఎంట్రీ ఉండదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఆలయంలోనూ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Also read:

Richest Man of India: ధనవంతుల జాబితాలో అంబానీ డౌన్.. ఇక దేశంలో నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ ఆయనే..!

మళ్ళీ లాక్‌డౌన్‌ కావాలంటున్న స్టూడెంట్స్ !! ఎందుకో తెలిస్తే నవ్వకుండా ఉండలేరుగా !! వీడియో

Chiranjeevi: సినిమా తారలను వదలని మహమ్మారి!! చిరంజీవికి కరోనా పాజిటివ్‌ !! వీడియో