Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం, టీటీడీ కీలక నిర్ణయం

|

Mar 29, 2024 | 4:46 PM

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (శ్రీవారు) దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి భక్తులున్నారు. ప్రతినిత్యం తిరుమలలో భక్తుల సందడి నెలకొంటుంది. అయితే కొందరు సర్వదర్శనం కు ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు మెట్ల ద్వారా నడిచి వెళ్తూ తిరుమల కొండకు చేరుకుంటారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం, టీటీడీ కీలక నిర్ణయం
Tirumala Tirupati
Follow us on

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (శ్రీవారు) దర్శనం కోసం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి భక్తులున్నారు. ప్రతినిత్యం తిరుమలలో భక్తుల సందడి నెలకొంటుంది. అయితే కొందరు సర్వదర్శనం కు ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు మెట్ల ద్వారా నడిచి వెళ్తూ తిరుమల కొండకు చేరుకుంటారు. అయితే గత కొంతకాలంగా ప్రమాదకర చిరుతల సంచారంతో భక్తులు భయపడిపోతున్నారు. అయితే టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదకర జంతువులు మెట్ల మార్గంలో తారసపడుతూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తాజాగా అలిపిరి సమీపంలోని తిరుమల పాదచారుల మార్గంలో చిరుత సంచారంపై శేషాచలం ఫారెస్ట్ రేంజర్లు దృష్టి సారించడంతో తిరుమలకు వచ్చే భక్తులకు భద్రతపై తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా పెంచింది. కొత్త పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానిక అటవీ అధికారుల నుంచి సమాచారం అందడంతో టిటిడి సిబ్బంది మెట్ల మార్గాలపై మళ్లీ నిఘా పెట్టింది. అయితే ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికారులు భక్తులకు హామీ ఇచ్చారు.

మెట్ల మార్గం నుంచి ఏడో మైలు వరకు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, గాలి గోపురం వంటి ప్రాంతాల్లో జంతువులతో పాటు చిరుత సంచారం ఉన్నట్లు గుర్తించారు. టీటీడీ ఏర్పాటు చేసిన కెమెరాలు చిరుత కదలికలను రికార్డు చేశాయని, అయితే పాదచారుల మార్గంలోకి చొరబడిన ఆనవాళ్లు లేవని అటవీ అధికారి ఒకరు తెలిపారు. ఏదేమైనా భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులుగా నడిచి వెళ్లాలని సూచించారు. ఇక ప్రత్యేకంగా పిల్లలను నిశితంగా పరిశీలించాలని టిటిడి కోరింది. ముందుజాగ్రత్త చర్యగా ముప్పు తగ్గే వరకు టీటీడీ నిఘా ఉంటుందని ముమ్మరం చేసింది. అయితే గతంలో చిరుతల సంచారం ఎక్కువ కావడం, పిల్లలు వాటిన బారిన పడటంతో టీటీడీ కఠిన చర్యలు తీసుకొని భక్తులకు కర్రలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.