4 / 6
ఇదే విషయంపై టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి ఆస్తులను ఆదాయాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో అనే విషయంపై అధ్యయనం చేసేందుకు అధికారులు, మేధావులు, హిందూ ధార్మిక సంస్థల అధినేతలు, భక్తులతో కూడిన కమిటీని త్వరలో ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు తెలిపారు. స్వామివారి విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్వామివారి ఆస్తుల విక్రయాలపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు.