Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన టీటీడీ బోర్డు.. మే 1వ తేదీ నుంచి…

|

Apr 18, 2021 | 10:35 AM

Tirumala Temple: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్.. కీలక ప్రకటన చేసిన టీటీడీ బోర్డు.. మే 1వ తేదీ నుంచి...
Ttd Board
Follow us on

Tirumala Temple: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కాగా, కరోనా వైరస్ ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి దర్శనంపైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి రూ. 300 దర్శన టికెట్లను 15 వేలు మాత్రమే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన టీటీడీ.. సదరు ప్రకటనను అధికారిక వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచింది. ఇప్పటికే సర్వ దర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం రోజుకు 30వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. తాజాగా నిర్ణయంతో మే 1వ తేదీ నుంచి 15వేల మందికి మాత్రమే శ్రీవారికి దర్శనం కల్పించనున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో టీటీడీలోనూ పలువురు వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుత పరిస్థితులు గతేడాదికన్నా భయానకంగా ఉండటంతో టీటీడీ బోర్డు యాజమాన్యం అప్రమత్తమైంది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను భారీగా కుదించారు. కరోనా పరిస్థితులు గమనిస్తుంటే.. ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు. దాంతో సాధారణ పరిస్థితి వచ్చే వరకు రోజుకు 15 వేల మందికి మాత్రమే తిరుమలేశుడి దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు టీటీడీ ప్రకటించింది.

కాగా, గతేడాది కరోనా వ్యాప్తి కారణంటా తిరుమలలో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఆ తరువాత పరిస్థితులు కుదిటపడటంతో కొద్ది కొద్దిగా భక్తుల దర్శనాలను పెంచుకుంటూ వచ్చారు. తొలుత రోజుకు 3వేల మంది భక్తుల చొప్పున శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వగా.. ఇప్పుడు రోజుకు 30 వేల మంది వరకు భక్తులు తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. మళ్లీ కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తుండటంతో తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Also read:

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 5వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు..

Self Lockdown : ఏపీలో దడపుట్టిస్తోన్న కరోనా, పట్టణాలు.. గ్రామాల్లో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తోన్న జనం

RIP Vivek: మరో నవ్వుల రారాజును కోల్పోయిన వెండితెర.. 35 ఏళ్లకు పైగా సినిమానే జీవితంగా బ్రతికిన కామెడీ కింగ్