AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: తిరుమలలో ఏఐ టెక్నాలజీ.. టీటీడీ కీలక నిర్ణయాలు..

ఆధ్యాత్మిక క్షేత్రంలో అంతా సాంకేతికతే. ఏఐ డిజిటలైజేషన్ తో తిరుమలలో సరి కొత్త విధానాలే. అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్. కొనుగోళ్లలో పారదర్శకతకు డిజిటల్ ప్లాట్ ఫారమ్. ప్రసాదాల్లో కల్తీకి చెప్పేలా ల్యాబ్. అలిపిరి వద్ద ఏఐ పహారతో భద్రత కట్టుదిట్టం. ఇది టీటీడీ లో కొనసాగుతున్న టెక్నాలజీ స్పీడ్.

Tirumala: తిరుమలలో ఏఐ టెక్నాలజీ.. టీటీడీ కీలక నిర్ణయాలు..
Tirumala
Raju M P R
| Edited By: |

Updated on: Apr 21, 2026 | 9:14 PM

Share

తిరుమల క్షేత్రం. దేశంలో అతిపెద్ద ధార్మిక సంస్థగా ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రం. కలియుగ వైకుంఠంగా కొట్లాది మంది భక్తులను ఆకర్షిస్తున్న తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. నిత్యం శ్రీవారి దర్శనం కోసం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం పారదర్శకతను పెంచడం లక్ష్యంగా టీటీడీ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. భద్రతను పటిష్టం చేయడం తో పాటు విప్లవాత్మక నిర్ణయాలను అమలుచేస్తోంది. దాతల సహకారంతో టెక్నాలజీని కొండపైకి తీసుకొచ్చింది టీటీడీ. ఇందులో భాగంగానే కమాండ్ కంట్రోల్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించింది. ఎన్నారైల దాతృత్వంతో సుమారు రూ. 20 కోట్లతో వైకుంఠం వన్ కాంప్లెక్స్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు అయ్యింది. ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో భక్తుల సంఖ్య, టీటీడీ భక్తులకు అందించాల్సిన సేవలు, స్వామి దర్శనం కల్పించేందుకు పట్టే సమయం లాంటి వివరాలను పసిగట్టే ఏఐ టెక్నాలజీని టిటిడి వినియోగిస్తోంది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్ లోని భక్తులకు శ్రీవారి దర్శనం ఎంత సమయం పట్టే అవకాశం ఉందన్న వాస్తవ పరిస్థితులను 3డి మ్యాప్ ల ద్వారా విశ్లేషిస్తోంది టిటిడి.

కల్తీకి చెక్ పెట్టే అత్యాధునిక ల్యాబ్

ఇక టీటీడీ కొనుగోళ్లలోనూ పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏటా దాదాపు రూ. 700 కోట్ల విలువైన 97 రకాల దినుసులను టిటిడి కొనుగోలు చేస్తుంది. కొనుగోళ్లలో గుత్తాధిపత్యానికి చెక్ పెడుతున్న టిటిడి కొనుగోళ్ల వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేసింది. టెండర్లలో లొసుగులు లేకుండా వ్యాపారులతో కక్కుర్తి పడకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారి లడ్డు, అన్న ప్రసాదాల తయారీలో వినియోగించే ముడి సరుకుల్లో ఎలాంటి కల్తీకి ఛాన్స్ లేకుండా అత్యాధునిక ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 20 కోట్లతో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలతో అత్యధిక ల్యాబ్ ను సీఎం చేతుల మీదుగా టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. నెయ్యి పాలు, నూనెలే కాకుండా వాటర్ ను పరీక్షించే ల్యాబ్ ను టీటీడీ నెలకొంది. పార్ట్స్ ఫర్ ట్రిలియన్ స్థాయిలో అంటే అత్యంత సూక్ష్మమైన కల్తీని సైతం పసిగట్టే సామర్థ్యం ఉన్న ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ-నోస్, ఈ- టంగ్ పరికరాలు రుచి వాసన ఆధారంగా నెయ్యి స్వచ్ఛతను కచ్చితంగా తేల్చే పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దాదాపు 200 రకాల అవశేషాలను గుర్తించే ల్యాబ్ లో ఫ్రాన్స్ టెక్నాలజీ మిషనరీ అందుబాటులో ఉంది.

టీటీడీ సేవలకు భక్తుల ప్రశంసలు.

ఇక తిరుమలలో రద్దీ ప్రాంతాల్లో పాదరక్షలు అస్తవ్యస్తంగా పడి ఉండడం భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన టిటిడి క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ షూ కీపింగ్ సిస్టం ని అమలు చేస్తుంది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో షూ కీపింగ్ వ్యవస్థను నిర్వహిస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సులభంగా డిపాజిట్ చేసి దర్శనం అనంతరం వేగంగా తిరిగి పొందేలా భక్తులకు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన టీటీడీ భక్తుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

ఏఐ పహారా

ఇలా ఏఐ, డిజిటలైజేషన్ తో పాటు తిరుమలలో సరికొత్త విధానాలను అమలు చేస్తున్న టీటీడీ భక్తుల సౌకర్యాలు, దర్శనం టికెట్ల జారీ, పారదర్శకంగా సేవలు అందించేందుకే కాకుండా భద్రత విషయంలోనూ టెక్నాలజీకి పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగానే తిరుమలకు వెళ్లే అన్ని మార్గాల్లో అత్యాధునిక టెక్నాలజీతో నిఘా కట్టుదిట్టం చేస్తుంది. అలిపిరి మార్గంలో ఏఐ పహారాకు ప్రాధాన్యత ఇస్తోంది. అత్యాధునిక డ్రోన్లను, ఏఐ ఆధారిత సోలార్ కెమెరాలను, 360 డిగ్రీల కోణంలో 400 మీటర్ల దూరం వరకు నడక మార్గంలో వన్యప్రాణుల కదలికలను గుర్తించేలా కెమెరాలను వినియోగిస్తోంది. అలారం సిస్టం ఉండే ట్రాప్ కెమెరాలతో వన్యప్రాణుల సమాచారం కమాండ్ కంట్రోల్ రూమ్ కు అందేలా టిటిడి చర్యలు చేపట్టింది. ఇలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంలో అమలు చేస్తున్న టిటిడి భక్తుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాదు దేశానికి రోల్ మోడల్ గా మారింది.

Follow Us
టీటీడీ అడుగులన్నీ టెక్నాలజీ వైపే..
టీటీడీ అడుగులన్నీ టెక్నాలజీ వైపే..
ఎండలో నల్లగైన ముఖాన్ని తెల్లగా మార్చే సూపర్ చిట్కా.. పార్లర్‌తో..
ఎండలో నల్లగైన ముఖాన్ని తెల్లగా మార్చే సూపర్ చిట్కా.. పార్లర్‌తో..
ఇనుప రాడ్లు,ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు! కారణం ఇదే
ఇనుప రాడ్లు,ఖాళీ సీసాలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు! కారణం ఇదే
పాన్ కార్డే ఏయే సమయాల్లో అవసరం..? కేంద్రం కొత్త రూల్స్
పాన్ కార్డే ఏయే సమయాల్లో అవసరం..? కేంద్రం కొత్త రూల్స్
ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి..
ఎప్పుడూ పాత పద్దతేనా.. షాహీ చికెన్ కుర్మా ఇలా ట్రై చేయండి..
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
ఈ అరుదైన పండు 14 రోజులు తిన్నారంటే.. శరీరంలో జరిగేది అద్భుతమే!
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
కల్తీ బెల్లాన్ని చిటికెలో కనిపెట్టండి.. ఈ సింపుల్ చిట్కాలతో..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
అక్షర్ అదృష్టం, ఇషాన్ దురదృష్టం.. టాస్‌లో విచిత్ర రికార్డులు
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!
ఇంట్లో సాలీడు గూళ్లు కడుతున్నాయా? ఇలా చేస్తే క్షణాల్లో మాయం!