ప్రపంచంలోనే నెయ్యితో నిర్మించిన ఏకైక దేవాలయం..ఎప్పుడైనా చూసారా? ఈ సారి తప్పక వెళ్లండి..

|

Sep 18, 2024 | 6:12 PM

అయితే, నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మించారనే వాదనను కొందరు కొట్టేపడేస్తారు. అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు. మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకతతో ప్రజల్ని ఆకర్షిస్తోందని స్థానికులు, భక్తులు చెబుతున్నారు.

ప్రపంచంలోనే నెయ్యితో నిర్మించిన ఏకైక దేవాలయం..ఎప్పుడైనా చూసారా? ఈ సారి తప్పక వెళ్లండి..
Temple Built Using Ghee
Follow us on

మన దేశంలో దేవాలయాలకు కొదువ లేదు..భారతీయ దేవాలయాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన, అద్భుతమైన నిర్మాణ పద్ధతులను కలిగి ఉంటాయి. కానీ, ప్రపంచంలోకెల్లా అరుదైన, అద్భుతమైన దేవాలయం ఒకటి ఉంది. ఈ ఆలయ నిర్మాణ ప్రక్రియ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎక్కడైనా ఎలాంటి నిర్మాణానికైనా సిమెంట్, ఇసుక, నీటిని ఉపయోగిస్తారు. కానీ, ఈ ఆలయం నిర్మాణానికి మాత్రం నెయ్యి వినియోగించారు. అది కూడా కేజీ రెండు కేజీలు నామ మాత్రంగా కాదండోయ్ ఏకంగా 40 వేల కేజీల నెయ్యిని ఉపయోగించారట. ఇలాంటి అరుదైన ఆలయం ఎక్కడ ఉంది.. ఆ ఆలయ విశిష్టతలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రాజస్థాన్ లోని భండాసర్‌లో ఉంది ఇలాంటి అరుదైన దేవాలయ. 15వ శతాబ్ధంలో బండా షా ఓస్వాల్ అనే సంపన్న వ్యాపారి ఈ ఆలయాన్ని నిర్మించారు. జైనమతంలోని ఐదవ తీర్థంకరుడైన సుమతీనాథ్ కు ఈ ఆలయం అంకితం చేశారు. అనేక జైన దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయం కూడా చక్కని శిల్పాలు, రంగు రంగుల కుడ్య చిత్రాలతో అందంగా ఆకర్షణీయంగా నిర్మించారు. మూడు అంతస్తులలో ఈ నిర్మాణం ఉంటుంది. ప్రతి ఒక్కటి జైన సంస్కృతిని కళ్లకు కట్టినట్టుగా చూపుతుంది. గోడలు, స్తంభాలు, పైకప్పులు అన్నీ అందమైన పెయింటింగ్స్, కళాకృతులతో కనువిందు చేస్తుంటాయి. వివిధ జైన తీర్థంకరుల జీవితాల దృశ్యాలను చూపుతాయి. ఈ ఆలయ నిర్మాణం వెనుక వైవిధ్యభరితమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఇక్కడి సుమతీనాథ్‌ ఆలయాన్ని నెయ్యితో నిర్మించడం వెనుక ఒక కథనం అత్యంత ప్రాచుర్యంలో ఉంది..అదేంటంటే..బండా షా భూమిలో ఆలయాన్ని నిర్మించాలనే విషయమై గ్రామస్తులను సంప్రదించినప్పుడు వాళ్ళు దానికి అంగీకరించలేదు. దానికి కారణం ఈ ప్రాంతంలో అప్పటికే తీవ్రమైన నీటి కొరత ఉందట. ఆలయ నిర్మాణానికి నీటిని ఉపయోగిస్తే తమకు ఇబ్బందులు తప్పవని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆలయం పూర్తవుతుంది కానీ, ఇక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తారని అన్నారు. దాంతో ఎలాగైనా ఇక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్న బండా షా ఆలయ నిర్మాణానికి నీటికి బదులు నెయ్యిని ఉపయోగించినట్టుగా చెబుతారు.

ఇవి కూడా చదవండి

అయితే, నీటికి బదులుగా నెయ్యితో ఆలయం నిర్మించారనే వాదనను కొందరు కొట్టేపడేస్తారు. అలా చేస్తే గుడి పడిపోతుందని అంటారు. మరికొందరు మాత్రం నెయ్యితో కట్టడం వల్ల ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయని చెబుతారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఆలయం ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైన కళాత్మకతతో ప్రజల్ని ఆకర్షిస్తోందని స్థానికులు, భక్తులు చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..