ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా.? ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవికి బదులు దరిద్రానికి వెల్కమ్ చెప్పినట్లే.!

Muggu affect wealth: రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారా.. మీరు ముగ్గు పేరుతో పిలుస్తుంది లక్ష్మీదేవిని కాదు.. ప్రతికూల శక్తులను. ముగ్గు అంటేనే ఒక వెల్కం బోర్డు లాంటిది. కానీ, శాస్త్రం ప్రకారం సూర్యుడు అస్తమించాక దేవతలందరూ విశ్రాంతి తీసుకుంటారు. మరి ఆ టైంలో మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు. మీరు పిలుస్తున్నది చీకట్లో తిరిగే క్షుద్ర శక్తులని, సాక్షాత్తు దరిద్ర దేవతని అని తెలుసుకోండి.

ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారా.? ఈ తప్పు చేస్తే లక్ష్మీదేవికి బదులు దరిద్రానికి వెల్కమ్ చెప్పినట్లే.!
Muggu

Edited By:

Updated on: Feb 06, 2026 | 11:15 AM

ఇంటి లోపల అలంకరణ ఎంత అద్భుతంగా ఉన్నా.. ముంగిట్లో వేసే ముగ్గు ఆకర్షణ ముందు మిగతావి అన్నీ తక్కువే. ముగ్గు వేయడం వెనుక అనేక కారణాలు చెబుతుంటారు పెద్దలు. ఇంటి ముందు రంగు గంగుల ముగ్గు వేయడం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అలాగే పాత రోజుల్లో ధాన్యం పిండితో ముగ్గులు వేయడం వల్ల అలంకరణ మాత్రమే కాదు.. అది చీమలకు, చిన్న పక్షులకు ఆహారంగా కూడా ఉంటుందనేది ప్రధాన ఉద్దేశంగా చెబుతుంటారు. అయితే ఆకర్షణ ఉద్దేశం మాట అలా ఉంచితే ముగ్గు వేయడం ద్వారా మంచి ఫలితాలు ఇస్తాయని చాలామంది నమ్ముతుంటారు. అలాంటిది ఇంటి ముందు వేసే ముగ్గు వల్ల అనర్థాలు కూడా ఉంటాయనేది కొందరు చెబుతున్న మాట.

రాత్రిపూట ముగ్గులు వేస్తే..

రాత్రి ముగ్గులు వేస్తున్నారా.. అయితే వెంటనే ఆపేయండి మీరు ముగ్గు పేరుతో పిలుస్తుంది లక్ష్మీదేవిని కాదు మరెవరో తెలిస్తే షాక్ అవుతారు.. అంటూ చెబుతున్న విషయం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ముగ్గు అంటేనే ఒక వెల్కం బోర్డు లాంటిది. కానీ, శాస్త్రం ప్రకారం సూర్యుడు అస్తమించాక దేవతలందరూ విశ్రాంతి తీసుకుంటారు. మరి ఆ టైంలో మీరు ఎవరిని ఇన్వైట్ చేస్తున్నారు. మీరు పిలుస్తున్నది చీకట్లో తిరిగే క్షుద్ర శక్తులని, సాక్షాత్తు దరిద్ర దేవతని. రాత్రి పూట ముగ్గు వేస్తే ఆ నెగటివ్ ఎనర్జీ అడ్రస్ వెతుక్కొని మరీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. తెలిసి తెలియక దరిద్ర దేవతని, శనిని రాత్రి ముగ్గువేసి మీరే ఇంట్లోకి ఆహ్వానించకండి. ముగ్గు ఎప్పుడు తెల్లవారుజామున వేస్తేనే లక్ష్మీ కటాక్షం రాత్రి వేస్తే దరిద్రం.

రాత్రి ముగ్గులో ఇంత దాక్కొని ఉందా అనుకుంటున్నారా.. మూఢనమ్మకాల్ని నమ్మాల్సిన అవసరం లేదు.. కానీ, సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. రాకెట్ ఎగరవేసే ముందు కూడా శాస్త్రవేత్తలు తిరుమలలో పూజలు చేయిస్తారు కదా.. కొన్ని నమ్మాలి మరి కొన్ని సంప్రదాయాలను గౌరవించాలి. చెడు ఫలితాలని మిగిల్చే కొన్ని అలవాట్లను మానుకుంటే మంచిదని పెద్దలు చెబుతున్న మాట.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)