Ayodhya Rama Mandir: అయోధ్యలో శ్రీ రామ మందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామాలయ పునాది రూపకల్పనలో 42 లేయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయ్యాయి. అయితే, అకస్మాత్తుగా రామాలయ రూపకల్పనలో పాక్షిక మార్పు జరిగింది. ఇప్పుడు పునాది లేయర్ల సంఖ్య 44 కి బదులుగా 48 పొరలకు పెరిగింది. ఇది మాత్రమే కాకుండా పునాది పునాది రాఫ్ట్ మందం కూడా తగ్గించారు. మునుపటి డిజైన్ ప్రకారం, పునాది రాఫ్ట్ మందం 2.5 మీటర్లు, ఇది ఇప్పుడు 1.5 మీటర్లకు తగ్గించారు.
42 లేయర్ పునాది రెడీ
ఫౌండేషన్ డిజైన్ ప్రకారం 44 పొరలు నిర్మించాల్సి ఉందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీనియర్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా అన్నారు. ఇప్పుడు దానిలో 4 పొరలు పెంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 42 లేయర్లు నిర్మాణం పూర్తయిందని తెలిపారు.
నవంబర్ మొదటి వారంలో..
అనిల్ మిశ్రా ఒక లేయర్ నిర్మాణానికి రెండు రోజులు పడుతుందని చెప్పాడు. పొర నిర్మాణ పనులు సెప్టెంబర్ 20 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఆ తర్వాత రాఫ్ట్ నిర్మాణం ప్రారంభమవుతుంది. అక్టోబర్ నాటికి పూర్తవుతుంది. మీర్జాపూర్‌లోని వింధ్యవాసిని ధామ్‌లోని ఎర్ర ఇసుకరాయి నుండి అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ప్లింట్ నిర్మాణం ప్రారంభమవుతుంది.
కొత్త రూపుపై నిరంతరం చర్చలు..
అయోధ్యకు కొత్త రూపాన్ని అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పుడు, రూ .22 కోట్ల వ్యయంతో, గుప్తఘాట్ కంటికి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా అభివృద్ధి చేస్తారు. ఇది కాకుండా, పంఖుముఖి మహాదేవ్ ఆలయం నుండి కొత్త లింక్ రోడ్డు నిర్మిస్తారు. .
కొత్త పనులకు అంగీకారం..
జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్, అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ VC విశాల్ సింగ్ ఇరిగేషన్, హార్టికల్చర్, రెవెన్యూ, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అలాగే ఇతర విభాగాలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మొత్తం ప్రాజెక్ట్‌ను కూలంకషంగా అధ్యయనం చేశారు. దిజన్ కు సంబంధించిన అన్ని పనుల పరిశీలన పూర్తి చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ దాని డీపీఅర్ (DPR) సిద్ధం చేసిన తర్వాత పనిని ప్రారంభించాలని ఆదేశించారు.
కాగా, రామాలయం ఏళ్ల పాటు పటిష్టంగా ఉండేందుకు భూమిలోపల 40 అడుగుల నుంచి కాంక్రీట్ పోస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. మొత్తం 44 కాంక్రీట్ లేయర్స్ వేయాల్సి ఉండగా మారిన డిజైన్ ప్రకారం ఈ లేయర్స్ సంఖ్య 48కి చేరింది. ఇప్పటికి 42 లేయర్ల నిర్మాణం పూర్యైంది. మొత్తం లేయర్ల నిర్మాణం పూర్తి అయిన తరువాత.. వాటిపై రామాలయం గర్భగుడి నిర్మాణం చేపట్టనున్నారు. 12 ఫీట్ల ఎత్తైన వేదికపై ఆలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది. కాగా, రామాలయం నిర్మాణం కోసం చేపట్టిన ఫౌండేషన్‌లో శ్రీరామునికి సంబంధించిన అవశేషాలు, పురాత విగ్రహాలను చెక్కుచెదరకుండా భద్రపరిచారు.
అయోధ్యలో రామాలయం ఫౌండేషన్ పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తవుతాయని రామ్ మందిర్ ట్రస్ట్ వెల్లడించింది. రెండో దశ పనులు డిసెంబర్‌లో ప్రారంభం అవుతాయన్నారు. రెండవ దశలో రాతి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా మీర్జాపూర్ గులాబీ రాళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గులాబీ రాళ్ల కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రాళ్లను చెక్కడం, నిర్మాణ పనులన్నీ రామ జన్మభూమిలోనే జరుగుతాయని రామ్ మందిర్ ట్రస్ట్ ధర్మకర్త అనిల్ మిశ్రా తెలిపారు. మొత్తానికి అయోధ్య రామమందిరం 2024, మార్చి నాటికి సిద్ధమవుతుందని తెలిపారు.