Swapna Shastra: ఇలాంటి కలలు పదే పదే వస్తుంటే.. దురదృష్టానికి సంకేతం.. జీవితంలో రానున్న కష్టాలను తెలియజేస్తాయట

స్వప్న శాస్త్రం అంటే కలలను అర్థం చేసుకోవడానికి ఒక పురాతన పద్ధతి. కలలు భవిష్యత్ లో జరగనున్న సంఘటలను తెలియజేస్తాయని నమ్మకం. కొన్ని కలలు శుభాన్ని సూచిస్తాయని.. మరికొన్ని కలలు అశుభ సంఘటనలకు సూచన అని నమ్ముతారు. ఉదాహరణకు, నల్లటి మేఘాలు, కాకులు, రక్తస్రావం, అడవి జంతువులు మొదలైనవి మీ కలలో పదే పదే కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం అర్ధం ఏమిటో తెలుసుకుందాం..

Swapna Shastra: ఇలాంటి కలలు పదే పదే వస్తుంటే.. దురదృష్టానికి సంకేతం.. జీవితంలో రానున్న కష్టాలను తెలియజేస్తాయట
Swapna Shastram

Updated on: May 09, 2025 | 9:09 PM

ప్రతి ఒక్కరూ నిద్రలో రకరకాల కలలు కంటారు. ఇంకా చెప్పాలంటే కలలు కనడం సాధారణం. అయితే కొన్ని రకాల కలలు మంచి విషయాలను సూచిస్తుండగా.. కొన్ని కలలు అశుభ సంఘటనలను సూచిస్తాయి. ముందస్తు హెచ్చరికను అందిస్తాయి. అయితే కొన్ని కలలు వింతగా ఉండటమే కాదు మన జీవితాలపై మర్మమైన, లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మరి శుభకరమైన, అశుభకరమైన కలలు అంటే ఏమిటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

కలల అర్థాన్ని విశ్లేషించి అర్థం చేసుకునే పురాతన శాస్త్రం స్వప్న శాస్త్రం. వ్యక్తిగత అభివృద్ధిలో కలలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భావాలు, భయాలు, కోరికలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతాయి. కలలను విశ్లేషించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు. మీరు జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు అని స్వప్న శాస్త్రం చెబుతుంది.

ఇలాంటి కలలు భవిష్యత్ జీవితంలో దురదృష్టానికి సంకేతాలు:

  1. కలలో ఎద్దుల బండిని చూడటం అంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యకలాపాలు నెమ్మదిస్తాయని సూచిస్తుంది. అంతేకాదు ఈ కల భవిష్యత్తులో వైఫల్యాలను సూచిస్తుంది.
  2. కలలో దట్టమైన నల్లటి మేఘాలను చూడటం దురదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. కలల వివరణ ప్రకారం చీకటి మేఘాలను చూడటం అంటే మీ జీవితంలోకి త్వరలో అడ్డంకులు వస్తాయని అర్ధం.
  3. ఇవి కూడా చదవండి
  4. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నల్ల కాకిని చూడటం అశుభం. ఇది రానున్న పెను ప్రమాదాన్ని సూచిస్తుంది. మరణ వార్త వినడానికి ఎక్కువ అవకాశం ఉంది.
  5. ఎవరి కలలో నైనా నల్లని దుస్తులు లేదా నల్లని వస్తువులు ధరించడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది.
  6. అదేవిధంగా కలలో రక్తస్రావం చూడటం దీర్ఘకాలిక అనారోగ్యానికి సంకేతంగా పరిగణించబడుతుంది.
  7. కలలో అడవి జంతువులు మిమ్మల్ని వెంబడిస్తున్నట్లు కనిపిస్తే అది అశుభం. అలాంటి కల భారీ ఆర్థిక నష్టాలకు సంకేతంగా పరిగణించబడుతుంది.
  8. కలలో తుఫాను, సుడిగాలి లేదా ఇల్లు కూలిపోయినట్లు కలలుగన్నట్లయితే దురదృష్టం మిమ్మల్ని నీడలా వెంటాడుతుందని అర్థం.
  9. కలలో చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం కనిపించడం అశుభం. ఇలాంటి కల వస్తే మీ జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  10. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పక్షులు ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. ఇటువంటి కల వస్తే డబ్బు కోసం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ముందస్తుగా సూచిస్తుంది.
  11. ఎవరైనా కలలో పెద్ద శబ్దాలు విన్నట్లయితే.. ఆ కలకు అర్థం కలలు కనేవారి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలకు సంకేతంగా పరిగణించబడుతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.