Aditya Hridaya stotram : ఆదిత్య హృదయ స్తోత్రం ఆదివారం పఠిస్తే కలిగే లాభాలు ఎన్నో..

హిందూ మతంలో ఆదివారం గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. సూర్య భగవానుడితో సంబంధం ఉన్న ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆదివారం పఠించడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Aditya Hridaya stotram : ఆదిత్య హృదయ స్తోత్రం ఆదివారం పఠిస్తే కలిగే లాభాలు ఎన్నో..
Lord Surya Puja Tips

Updated on: Oct 05, 2025 | 10:01 AM

జ్యోతిషశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాలకు అధిపతిగా.. ఆత్మకు కారకుడిగా పరిగణిస్తారు. ఆదివారం ఆయనను పూజించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. హిందూ మతంలో సూర్యభగవానుడిని కనిపించే దైవంగా భావిస్తారు. సూర్యుడిని పూజించడం వల్ల సూర్యుడిలా ప్రకాశం, కీర్తి లభిస్తుంది. ఆదివారాల్లో సూర్యుడిని పూజించేందుకు అనేక నియమాలున్నాయి. వాటిలో ఒకటి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఆదివారాల్లో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..

ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం

ఆదిత్య హృదయ స్తోత్రం అనేది సూర్య భగవానుడి శక్తితో అనుసంధానమై జీవితంలో విజయం సాధించడానికి పఠించబడే ఒక శ్లోకం. దీని పారాయణం చేయడం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్మకం. ఉద్యోగంలో పదోన్నతులు, సంపాదన, జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులను తొలగించడం కోసం ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్రం ప్రయోజనాలు

ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన సూర్య భగవానుడిని ప్రసన్నం అయ్యి.. జీవితంలో విజయం లభిస్తుందని భావిస్తారు. ఆదివారాల్లో దీనిని పఠించడానికి.. మొదట వినియోగ మంత్రాన్ని జపించి.. ఆపై ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించి.. చివరగా సూర్యుడికి మీ కోరికలను తెలియజేయాలి. ప్రత్యామ్నాయంగా ఆదివారాల్లో సూర్యుడికి అంకితమైన ఈ మంత్రాలను జపించవచ్చు.

ఇవి కూడా చదవండి

సూర్య భగవానుని మంత్రాలు

  1. “ఓం సూర్యాయ నమః”
  2. “ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమః”
  3. “ఓం హ్రీం ఘృణి సూర్య ఆదిత్య క్లీం ఓం”

ఆదిత్య హృదయ స్తోత్రం

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || ౩ ||

ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయ్యం పరమం శివమ్ || ౪ ||

సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనమాయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||

రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాఁల్లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||

ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||

పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||

ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||

హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||

వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీప్లవంగమః || ౧౩ ||

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||

నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | [పశ్చిమే గిరయే]
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||

బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||

ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||

ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||

అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

ఇతి ఆదిత్య హృదయమ్ |

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.