Tridandi Chinna jeeyar swamiji: వేద వేద్యుడు, వేద గురువు, ఉపదేశకుడు, శ్రీవైష్ణవ ప్రముఖుడు, నడిచే తిరుమంత్రం అని భక్తులు మనసార పిలుచుకొనే పేరు శ్రీ శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి. గాడాందాకారంలో ఉన్న దీనజనులను ఉద్దరించి వారికి ఆత్మ జ్ఞాన సిద్దిని కలిగించాడానికి మానవ రూపంలో అవతరించిన స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవ పర్వదినం.. కమనీయం.. కడు రమణీయం.
భక్తులు పరమ పవిత్రంగా భావించే స్వామి వారి తిరునక్షత్రం మహోత్సవం నవంబరు 4 నుంచి 8 వ తేది వరకు అంగరంగ వైభవంగా దివ్యసాకేతం లోని శ్రీ సీతారామ ఆలయం లో శ్రీరాముని సన్నిధిలో 5 రోజుల పాటు భక్తులు ఆనందోత్సవాల నడుమ జరుగనున్నాయి. ఆ ఐదు రోజుల పాటు స్వామి నిర్వహించే కార్యక్రమ ప్రణాళికలతో కూడిన కరపత్రాన్ని ఈ రోజు ఆవిష్కరించారు.
తెలుగునాట శ్రీవైష్ణవ వంశంలో ఆవిర్భవించిన సర్వోత్తమ ఆశ్రమాలలో జీయర్ పదానికి వన్నెతెచ్చిన సత్యసంకల్పలు శ్రీమత్ పరమహంస. పరివ్రాజకులు శ్రీ శ్రీ శ్రీ త్రిందండి రామానుజ పెద్ద జీయర్ స్వామి వారిని స్మరించే క్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి తిరనక్షత్ర మహహోత్సవం రోజు ప్రతిసంవత్సరం 1994 నుంచి వేద విద్వాంసులను జీయర్ పురస్కారాన్న ప్రధానం చేసి సత్కరించటం ఆనవాయితీగా మారింది.
తిరునక్షత్ర మహోత్సవంలో మొదటి రోజు 4 నవంబరున జీయర్ పురస్కారం ప్రధానోత్సవం. 5వ తేదీన శ్రీ కోదండరామస్వామికి కుంకుమార్చన, 6న తులసీ అర్చన, 7వ తేదీ ఉదయాన్న పుష్పార్చన, సమాశ్రయణములు, 8 తేదీన స్వామి ఆరాధ్య దైవం. అయిన శ్రీరామచంద్రుడికి సహస్ర కలశ స్నపనం నిర్వహిస్తారు.
Read also: Warangal: ఓరుగల్లులో అద్భుతంగా తెప్పోత్సవం.. భద్రకాళీ చెరువులో హంస వాహనంపై అమ్మవారి విహారం