Sri Sattemma Talli Jatara: తూర్పుగోదావరి జిల్లా(East Godavari District) చెయ్యెరు గున్నేపల్లి(Cheyyeru Gunnepalli) సత్తెమ్మతల్లి మహా జాతర మోహోత్సవం ఘనంగా ప్రారంభమయ్యింది. అయితే రాష్ట్రములోని పేరు పొందిన సత్తెమ్మతల్లి అమ్మవారి జాతరకు వచ్చే వేలాది మంది భక్తులకు మహా అన్న సంతర్పన కార్యక్రమానికి భారీ విందుకు ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. దాదాపు లక్ష మందికి సరిపడ భారీ పందిరి, 300 పాత్రలలో ప్రత్యేక వంటకాలు చేస్తున్నారు. 100 మంది..వంట మనుషులు, అన్న సంతర్పణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు…100 కేజీల గిన్నెలు, 200 కేజీల పెద్ద అక్షయ పాత్రలలో వంటకాలు చేస్తున్నాట్లు తెలిపారు వంట మాస్టర్ శంకర రావు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యరు గుంనేపల్లి లో ఉన్న శ్రీ శ్రీ సత్తెమ్మతల్లి 48వ వార్షికోత్సవ ఏర్పాట్లు అత్యంత వైభోగంగా చేశారు…సత్తెమ్మతల్లి జాతరకు వచ్చే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. దీనితో ఆలయ నిర్వహికులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే అన్నసంతర్పణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు 200 మంది వంటవాళ్ళతో పాటు, పలు రకాల శాకాహార వంటకాలు దాదాపు ఒక్కో కర్రీ 300 కేజీలకు పైగా వండనున్నారు..40 టన్నుల రైస్ అంటే సుమారు 7500 కేజీల అన్నం వండనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు
Reporter : Satya ,Tv9 telugu
Also Read: