నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ ప్రత్యేక క్షేత్రం

మహానంది ఆలయం ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది 7వ శతాబ్దానికి సంబంధించిన ఒక పురాతన శైవ దేవాలయం. ప్రధాన ఆలయానికి వచ్చే ముఖ ద్వారం గోపురం మధ్యలో ఉన్న పుష్కరిణిలోనికి శుద్ధమైన నీరు ఎల్లప్పుడూ గోముఖ శిలా నుంచి ప్రవహిస్తుంది. లక్షలాది మంది మంది భక్తులు, యాత్రికులు.. శాంతి, ఆధ్యాత్మిక అనుభవం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ ప్రత్యేక క్షేత్రం
Mahanandi

Updated on: Jan 09, 2026 | 6:17 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, నంద్యాల సమీపంలో ఉన్న మహానంది ఆలయం ప్రముఖ శివపుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది 7వ శతాబ్దానికి సంబంధించిన ఒక పురాతన శైవ దేవాలయం. లక్షలాది మంది మంది భక్తులు, యాత్రికులు.. శాంతి, ఆధ్యాత్మిక అనుభవం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

నిరంతరం నీటి ప్రవాహం

ప్రధాన ఆలయానికి వచ్చే ముఖ ద్వారం గోపురం మధ్యలో ఉన్న పుష్కరిణిలోనికి శుద్ధమైన నీరు ఎల్లప్పుడూ గోముఖ శిలా నుంచి ప్రవహిస్తుంది. ప్రధాన ఆలయంలోని శివలింగం కింద ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగం క్రింద నుంచి ఈ నీరు నిరంతరం ప్రవహిస్తుంటుంది.

ఆలయం లోపల ఉన్న రుద్రగుండంకి వచ్చిన నీరు ఎక్కడి నుంచి వస్తుందనే రహస్యాన్ని ఇప్పటికీ ఎంతోమంది శాస్త్రవేత్తలు గుర్తించలేకపోతున్నారు. ఆలయం వెనుక భాగంలోని నల్లమల అడవుల లోపల నుండి ఈ నీరు ప్రవహించి, గర్భగుడిలోని శ్రీ మహానందీశ్వర స్వామి విగ్రహం కింద భాగం గుండా బ్రహ్మగుండం కోనేరుకు చేరుతుంది.

అక్కడి నుండి ఇది ఆలయం ప్రాంగణంలోని చిన్న కోనేరులైన బ్రహ్మగుండం, విష్ణుగుండంలలోకి ప్రవేశించి, తర్వాత మహానంది చుట్టుపక్కల వందల ఎకరాల పంట పొలాల వరకు చేరుతుంది. ఈ విశేష ప్రవాహం ఆలయంలోని పవిత్రత, శుద్ధి మరియు ప్రకృతితో సమన్వయం అయిన ఒక అద్భుతం.

ఈ పుష్కరిణి నీరు మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది:

రుద్ర గుండం – గర్భగృహం అంతర్గతరంగంలో

విష్ణు గుండం – ఆలయం ప్రవేశద్వారం దగ్గర

బ్రహ్మ గుండం – ఇతర పుణ్యక్షేత్ర ప్రాంతంలో
ఈ నీరు చల్లని, స్వచ్ఛమైనది.

పవిత్రత, వైదిక విశ్వాసం

ఒకప్పుడు ఈ క్షేత్రంలో ఒక పుట్ట ఉండేది. ఆ పుట్ట మీద రోజూ ఒక కపిలగోవు వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది. ఆ పాలు బాల శివుడు నోరు తెరిచి త్రాగేవాడు. ఒక పశువుల కాపరి ఈ దృశ్యాన్ని చూసి పెద్ద నందునితో చెప్పాడు. నందుడు వచ్చి ఆ దృశ్యాన్ని చూసి తానంతా మమేకమయ్యాడు. ఆ హడావిడికి భయపడి గోవు పుట్టను తాకి బయటకు వెళ్లిపోయింది.

నందుడు తన చేసిన అపరాధానికి విచారించి, తన ఇష్టదైవం నందిని పూజించాడు. ఆవు తాకిన పుట్ట శిలా లింగంగా మారేట్లు నంది వరం ప్రసాదించాడని చెప్పబడుతుంది. ఇంకా ఈ శివలింగంపై ఆవు గిట్టల ముద్రలు స్పష్టంగా చూడవచ్చు.

నవనందుల ఉనికి

మహానంది దేవాలయం దగ్గరే తొమ్మిది నందుల ఆలయాలు (నవనందులు) ఉన్నాయి. ఇవన్నీ శివుడికి అంకితమైన ఇతర పుణ్యక్షేత్రాలుగా భావించబడతాయి. మహా నంది ఈ నవనందులలో ప్రముఖమైనది.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, ఉగాది, దసరా వంటి పండుగల సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, వేడుకలు ఉంటాయి. భక్తులు వేలాదిగా హాజరవుతారు.

మహానంది ఆలయం విశ్వాసం, ప్రకృతి, పురాతన చరిత్ర అద్భుతం కలిసి భక్తులకు కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది.