ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు.. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి

|

Jan 19, 2021 | 6:06 AM

మ‌ల‌య‌ప్ప‌స్వామి ఏడు ప్ర‌ధాన వాహ‌నాల‌పై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని వెల్లడించారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం ఏర్పాట్ల‌పై తిరుపతిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో..

ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు.. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి
Follow us on

Ratha Saptami Celebrations : ఫిబ్రవరి 19న తిరుమలలో రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా వాహన సేవల వివరాలను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజున మ‌ల‌య‌ప్ప‌స్వామి ఏడు ప్ర‌ధాన వాహ‌నాల‌పై ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తార‌ని వెల్లడించారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం ఏర్పాట్ల‌పై తిరుపతిలోని ప‌రిపాల‌నా భ‌వ‌నంలో చిత్తూరు జిల్లా క‌లెక్ట‌ర్ నారాయ‌ణ భ‌ర‌త్ గుప్తా, టీటీడీ అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్​తో ఈవో సమీక్ష నిర్వ‌హించారు.

శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి ఒకే రోజు ప్రధాన వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో ప్రారంభం కానున్న వాహన సేవలు రాత్రి చంద్ర ప్రభ వాహనంతో ముగుస్తాయి. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్నారు.

ఉదయం 5.30 నుంచి 8.00 వరకు సూర్యప్రభ వాహనం 
ఉదయం 9.00 నుంచి 10.00 వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11.00 నుంచి 12.00 వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు చక్రస్నానం
సాయంత్రం 4.00 నుంచి 5.00 వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6.00 నుంచి 7.00 వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8.00 నుంచి 9.00 వరకు చంద్రప్రభ వాహనం