Pandharpur Temple: ఇక నుంచి జియో టీవీలో విఠల పాండురంగని ప్రత్యక్ష దర్శనం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇప్పుడు మహారాష్ట్రతో పాటు భారతదేశం అంతటా ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లోనే విఠలుడిని దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది జియో ప్లాట్‌ఫామ్. జియో టీవీలో భక్తులు 24×7 పండరీపూర్ విఠలుడి ప్రత్యక్ష దర్శనం చేసుకోవచ్చు.

Pandharpur Temple: ఇక నుంచి జియో టీవీలో విఠల పాండురంగని ప్రత్యక్ష దర్శనం.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Shri Vitthal Rukmini Mandir

Updated on: Jul 06, 2022 | 4:05 PM

Pandharpur Temple: మన దేశంలో విష్ణుమూర్తి ఆలయాలు ఎన్నో వెలిశాయి. పూర్వీకుల కాలం నుంచి ఈ ఆలయాల్లో పూజలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రధానమైనది మహారాష్ట్రలోని పండరీపురంలో ఉన్న విఠలుడి దేవాలయం. స్థానికంగా విఠల్ రుక్మిణి ఆలయం గా ప్రాశస్త్యం పొందిన ఈ మందిరానికి దేశ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. ఆషాఢ మాసంలో.. ముఖ్యంగా ఆషాఢ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు భారతదేశం అంతటా ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లోనే విఠలుడిని (Shri Vitthal Rukimini Mandir Samiti, Pandharpur) దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది జియో ప్లాట్‌ఫామ్. జియో టీవీలో 24×7 పండరీపూర్ విఠలుడి ప్రత్యక్ష దర్శనం లైవ్ స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఆషాఢ ఏకాదశి సందర్భంగా భక్తులకు జియో ఈ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

ఆషాఢ మాసంలోని ఏకాదశి శుభ సందర్భంగా.. వందల సంవత్సరాల నాటి పండర్‌పూర్‌లో మహావిష్ణువు దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. భక్తులు మహాసముద్రాన్ని తలపిస్తారు. విఠల్ భగవానుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి,ఇతర కారణాల వల్ల అందరూ పండరీపురం వెళ్లి.. స్వామివారికి దర్శించుకోవడం కొంతమందికి సాధ్యం కాదు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న భక్తులు పండరినాథుడిని సందర్శించలేరు. అయితే ఇప్పుడు అటువంటి భక్తుల కోరికను తీరుస్తుంది Jio TV. మొబైల్ ఫోన్‌లో కేవలం ఒక క్లిక్‌తో పండరీపురంలో ఉన్న విఠలుడి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు.

ఇప్పుడు భక్తులు ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్‌లో పాండురంగుని ప్రత్యక్ష దర్శనం పొందవచ్చు. ఇంట్లో మహా పూజ, అభిషేకం, ఇతర ఆచారాలను కూడా చూడవచ్చు. Jio TV యాప్‌ని డౌన్‌లోడ్ చేయడంతో పాటు మొబైల్‌లో QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రత్యక్ష దర్శనాన్ని పొందవచ్చు. Jio TVలో ప్రత్యక్ష దర్శనం కోసం భక్తులు Jio TVలోని విఠల్ రుక్మిణి ఛానెల్‌ని సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం.. స్వామివారి  దర్శనం కోసం ‘దర్శన్’ చిహ్నంపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు శ్రీ అమర్‌నాథ్, చార్ధామ్, కొల్హాపూర్ మహాలక్ష్మి, అష్టవినాయక గణేష్ దేవాలయాల సహా ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాలను జియో టీవీలో ప్రత్యక్ష దర్శనం చేసుకున్నారు. ఈ  Jio TV ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఈ దేవతలను ప్రత్యక్ష దర్శనాన్ని చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..