
హిందూ పంచాంగం ప్రకారం.. శుభా కార్యాలు ఈరోజు(జనవరి 14) నుంచి మళ్లీ ప్రారంభమవుతాయి. దాదాపు నెల రోజులపాటు కొనసాగిన ఖర్మాస్(ఖర్మాలు) కాలం ఇప్పుడు ముగిసిపోతోంది. పంచాంగం ప్రకారం ఖర్మాస్ డిసెంబర్ 16, 2025న ప్రారంభమైంది. ఇప్పుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ముగుస్తుంది. సూర్యుడు ధనస్సు రాశి నుంచి బయల్దేరి జనవరి 14 రాత్రి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఖర్మాస్ ముగింపును సూచిస్తుంది. దీంతో శుభాకార్యాలు ప్రారంభమవుతాయి.
పంచాంగం, జ్యోతిష్య గణాంకాల ప్రకారం.. ఖర్మాస్ కాలం గత సంవత్సరం డిసెంబర్ 16న ప్రారంభమైంది. ఇప్పుడు సూర్య భగవానుడు ధనస్సు రాశి వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జనవరి 14, రాత్రి 9.19 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో ఖర్మాస్ కాలంలో నేటితో ముగుస్తుంది. దీంతో బుధవారం రాత్రి 9.20 గంటల నుంచి మకర సంక్రాంతి శుభకాలం ప్రారంభమవుతుంది.
శుభ కార్యాలు ప్రారంభం
హిందూ మతంలో ఖర్మాస్ కాలంలో శుభ కార్యాలు నిషేధం. అయితే, ఇప్పుడు సూర్యుడు ఉత్తరం వైపునకు వెళ్లిన వెంటనే ఈ కార్యకలాపాలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి.
వివాహ వేడుకలు:
వివాహాది శుభాకార్యాలు సంక్రాంతి నుంచి ప్రారంభించుకోవచ్చు.
గృహ ప్రవేశం: కొత్తి ఇంటికి మారడానికి ఇది మంచి సమయం.
వెంట్రుకలు తీయడం, ఉపయనాలు:
పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయడం, ఉపనయన కర్మలు చేయవచ్చు.
కొత్త వ్యాపారం:
కొత్త దుకాణం తెరవడం లేదా వ్యాపారం ప్రారంభించడం శుభప్రదం.
వాహనం, ఆస్తి కొనుగోలు:
పెట్టుబడి, కొనుగోలు కోసం ఇప్పుడు తలుపులు తెరిచి ఉన్నాయి.
ఖర్మాలు ఎందుకు అశుభం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు బృహస్పతి రాశి అయిన ధనస్సు లేదా మీనా రాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. దీనిని ఖర్మాస్ కాలం లేదా లోహ్రీ మాసం అంటున్నారు. ఈ సమయంలో చేసే పనులు పూర్తి ఫలితాలను ఇవ్వవని నమ్ముతారు. అయితే, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన వెంటనే.. అది శక్తివంతమవుతుంది. ఇది ఉత్తరాయణం అని పిలువబడే దేవతల రోజులు ప్రారంభాన్ని సూచిస్తుంది.
ఎందుకు ప్రత్యేకం?
మకర సంక్రాంతినాడు దానధర్మాలు, స్నానాలు, సూర్య పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజున గంగా నదిలో స్నానం చేసి నువ్వులు, బెల్లం దానం చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్ముతారు. సూర్య భగవానుడిని పూజించడం వల్ల ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు పొందుతారు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని TV9తెలుగు ధృవీకరించదు.