Dhritarashtra: మహాభారత పంచమవేదంగా కీర్తి గాంచింది. వ్యాస మహర్షి.. గురువు స్థానంలో.. ఉంది మహాభారతం చెబుతుంటే.. సాక్షాత్తు ఆది పూజ్యుడు గణపతి శిష్యుడు గా మారి మనవాళికి అందించిన అమృత భాండం మహాభారతం.. మన దైననందిన జీవితంలో ప్రతి సంఘటన తరచి చూస్తే… మహాభారతంలో ఆవిష్కరించి ఉంటాయి. కురువంశంలో జన్మించిన వారిని కౌరవులు అంటారు.. కానీ మహాభారతంలో ఎక్కువగా ధృతరాష్ట్ర. గాంధారిలకు పుట్టిన సంతానం కౌరవులుగా.. పాండురాజు…కుంతి, మాద్రిలకు పుట్టిన వారు పాండవులుగా.. వినతికెక్కారు..
మరి కౌరవులు 100 మంది అన్నదమ్ములు.. ఒక చెల్లెలు.. అయితే కౌరవుల్లో ఎక్కువగా ధుర్యోధన, దుశ్శాసన అనే పేర్లు మాత్రమే తెలుసు.. కాగా కౌరవ అన్నదమ్ముల పేర్లు.. వారి జననం గురించి తెలుసుకొందాం..!!
దుర్యోధనుడు… భీముడు కుంతి కి జన్మించిన క్షణాల్లోనే అదే సమయంలో మాంసఖండాల్లో కలి అంశతో గాంధారికి దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు జన్మిస్తూ ఉంటే క్రూరమృగాలు వికృతంగా అరిచాయి. నక్కలు ఊళలు వేశాయి. గుడ్లగూబలు ఘూంకారాలు చేశాయి. గాడిదలు ఓండ్రపెట్టాయి. జంతువుల రకరకాల అరుపులికి దిక్కులు అదిరాయి. ఆకాశంలోని సూర్యుడిమీద మసిగుడ్డ కప్పినట్టయింది. అతని తేజస్సు మాసింది. రాజ్యం అంతటా రక్తవర్షం కురిసింది. ప్రజలంతా భయాందోళనలు చెందారు.
దుర్యోధనుడు పుట్టిన మర్నాడు మాంసఖండాల్లోంచి దుశ్శాసనుడు పుట్టాడు. ఆ మర్నాడు దుస్సహుడు, ఆ మర్నాడు దుశ్శలుడు…అలా వరుసగా రోజుకి ఒకరుగా జన్మించారు.
1.దుర్యోధనుడు 2. దుశ్శాసనుడు 3. దుస్సహుడు 4. దుశ్శలుడు 5. జలసంధుడు, 6. సముడు, 7. సహుడు, 8. విందుడు, 9. అనువిందుడు, 10. దుర్దరుషడు, 11. సుబాహుడు, 12. దుష్టదర్షణుడు, 13. దుర్మర్షణుడు, 14. దుర్ముఖుడు, 15. దుష్కర్ణుడు, 16. కర్ణన 17. వివింశతి, 18. వికర్ణుడు, 19. శలుడు, 20. సత్వుడు, 21. సులోచనుడు, 22. చిత్రుడు, 23. ఉపచిత్రుడు, 24. చిత్రాక్షుడు, 25. చారుచిత్రుడు.
26. శరాశనుడు, 27. దుర్ముదుడు, 28. దుర్విగాహుడు, 29. వివిత్సుడు, 30. వికటాసనుడు, 31. ఊర్ణనాభుడు, 32. సునాభుడు, 33. నందుడు, 34. ఉపనందుడు, 35. చిత్రబాణుడు, 36. చిత్రవర్మ, 37. సువర్మ, 38. దుర్విమోచనుడు, 39. అయోబాహుడు, 40. మహాబాహుడు, 41. చిత్రాంగదుడు, 42. చిత్రకుండలుడు, 43. భీమవేగుడు, 44. భీమబలుడు, 45. బలాకి, 46. బలవర్ధనుడు, 47. ఉగ్రాయుధుడు, 48. సుషేనుడు, 49. కుండధారుడు, 50. మహోధారుడు.
51. చిత్రాయుధుడు, 52. నిషంగీపాశీ, 53. బృందారకుడు, 54. ధృఢవర్మ, 55. ధృఢక్రతుడు, 56. సోమకీర్తి, 57. అనూధరుడు, 58. దృఢసందుడు, 59. జరాసంధుడు, 60. సదుడు, 61. సువాక్కు, 62.ఉగ్రశ్రవుడు, 63. ఉగ్రసేనుడు, 64. సేనాని, 65. దుష్పజరాజయుడు, 66. అపరాజితుడు, 67. కుండశాయి, 68. విశాలాక్షుడు, 69. దురాధరుడు, 70. దృఢహస్తుడు, 71. సుహస్తుడు, 72. వాతవేగుడు, 73. సవర్చుడు, 74. ఆదిత్యకేతు, 75. బహ్వాసి
76. నాగదత్తుడు, 77. అగ్రయాయి, 78. కవచి, 79. క్రథనుడు, 80. కుండుడు, 81. భీమ విక్రమన 82.ధనుర్ధరడు, 83. ఉగ్రుడు, 84. భీమరథుడు, 85. వీరబాహుడు, 86. అలోలుపుడు, 87. అభయుడు, 88.రౌద్రకర్ముడు, 89.దృఢరథాశ్రయుడు, 90.అనాదృష్యుడు, 91. కుండభేది, 92. విరావి, 93. ప్రమథుడు, 94. ప్రమాధి, 95. దీర్ఘరోముడు, 96. దీర్ఘబాహుడు, 97. వ్యూఢోరుడు, 98. కనకధ్వజుడు, 99. కుండాౠ, 100. విరజసుడు
వందమంది కుమారులూ, దుస్సల ఒక కుమార్తె పుట్టారు.
అయితే గాంధారి గర్భవతిగా ఉన్న రోజుల్లోనే సుఖద అనే వైశ్యస్త్రీ, ధృతరాష్ట్రునికి సపర్యలు చేస్తూ.. అన్నిరకాలుగా చేదోడువాదోడుగా ఉండేది. ఆమె గర్భాన ధృతరాష్ట్రునికి ఓ కొడుకుపుట్టాడు. అతనిపేరు యుయుత్సుడు. ఇతను కూడా భీమ, ధుర్యోధనలు పుట్టిన సమయంలోనే జన్మించాడు. అతను కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షాన పోరాడాడు. అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తునకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు.
Also Read: ఈరోజు ఏ రాశి వారు వాహన ప్రయాణంలో , పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
సామాన్యుల భవిష్యత్ కు భద్రత కల్పించే ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.3 వేలు..